National Brothers Day: హ్యాపీ బ్రదర్స్ డే: తనువేలే వేరు.. మనస్సులు ఒక్కటే..

సోదరుల ప్రాముఖ్యత, మన జీవితంలో వారు పోషించే పాత్ర నొక్కి చెప్పేందుకు ప్రతి ఏటా మే 24న జాతీయ సోదరుల దినోత్సవం జరుపుకుంటాం.

Written By: Neelambaram, Updated On : May 24, 2024 4:40 pm

National Brothers Day

Follow us on

National Brothers Day: కుటుంబ బంధాలు విలువ ఇచ్చే దేశం ప్రపంచంలో భారత్ ఒక్కటని గర్వంగా చెప్పుకోవచ్చు. కన్నవారు, తోబుట్టువుల కోసం ఎంత వరకైనా తెగించేవారు కోకొల్లలు ఉన్నారు. ‘బంధం విలువ తెలుసుకుంటే భగవంతుడి విలువ తెలుస్తుందనేది’ నానుడి. తల్లిదండ్రులు ఒక వైపు అయితే తోడబుట్టిన వారు మరో వైపు కాలం గమనంలో తల్లిదండ్రులు ముందే వెళ్లిపోతారు.. ఆ తర్వాత తోడపుట్టిన వారు మాత్రమే మిగిలిపోతారు. వారు పెద్దవారు అయితే.. అందులో అన్న, తమ్ముళ్లు అయితే.. ఆడబిడ్డలకు పెద్ద అండ. తల్లిదండ్రులు లేకున్నా.. అన్న దమ్ములు ఉంటే చాలు ఆడబిడ్డలు, తమ్ముళ్లు అనందంగా బతికేస్తారు. అలాంటి సోదరులకు ఒక ప్రత్యేకమైన రోజు ఉంటే.. అదే రోజు ‘బ్రదర్స్ డే’.

సోదరుల ప్రాముఖ్యత, మన జీవితంలో వారు పోషించే పాత్ర నొక్కి చెప్పేందుకు ప్రతి ఏటా మే 24న జాతీయ సోదరుల దినోత్సవం జరుపుకుంటాం. ఒక వ్యక్తి సంక్షోభ సమయంలో, బాధల్లో, ఒంటరిగా ఉన్న సమయంలో సోదరుడు ఉండడొ పెద్ద వరం. ఈ రోజున మీరు మీ బ్రదర్ తో పంచుకునేందుకు కొన్ని కోట్స్ ఇస్తుంది ‘ఒకే తెలుగు’.

జాతీయ సోదర దినోత్సవం 2024: శుభాకాంక్షలు
*హ్యాపీ బ్రదర్స్ డే! నీ నవ్వుకు, నీ సపోర్ట్ కు, మరచిపోలేని జ్ఞాపకాలకు ధన్యవాదాలు. యూ ఆర్ మై బెస్ట్ బ్రదర్.
* హ్యాపీ బ్రదర్స్ డే! జీవితం నన్ను ఎక్కడికి తీసుకెళ్లినా.. నేను నమ్మే వ్యక్తి నిన్నొక్కడినే.. లవ్ యూ బ్రదర్!
* నా అద్భుతమైన సోదరుడికి, హ్యాపీ బ్రదర్స్ డే! నువ్వు నా పక్కన ఉంటే జీవితం బాగుంటుంది. కలిసి మరెన్నో సాహసాలు చేద్దాం!
* హ్యాపీ బ్రదర్స్ డే! మీ ప్రేమ, మార్గదర్శకత్వం నన్ను ఈ రోజు మంచి వ్యక్తిగా తీర్చిదిద్దాయి. ఇంతకంటే మంచి సోదరుడు కావాలని దేవుడిని అడగలేకపోయాను.

ఈ రోజు నేషనల్ బ్రదర్స్ డే కావడంతో కేవలం తోబుట్టువులే కాదు.. చిన్నాన, పెదనాన్న, చిన్నమ్మ, పెద్దమ్మ కొడుకులు కూడా బ్రదర్స్ అవుతారు. కాబట్టి నేషనల్ బ్రదర్స్ డే రోజు అందరూ కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. అన్నా తమ్ముళ్లు ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటే.. ఆడబిడ్డలు అన్న, తమ్ముళ్లకు విషెస్ చెప్తున్నారు. భాతర్ లో ఒక్కో ప్రతీ బంధం విలువైనదే.. ఈ డేలు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్నాయి. కానీ.. భారత్ ఉమ్మడి కుటుంబ వ్యవస్థను ప్రపంచానికి చాటుతుంది.