Varanasi Movie Updates: మహేష్ బాబు హీరోగా చేస్తున్న ‘వారణాసి’ సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. ఇక ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ ని రీసెంట్ గా విడుదల చేసిన విషయం మనకు తెలిసిందే. ఇక ప్రస్తుతం ఈ సినిమా నుంచి మరొక అప్డేట్ కూడా రాబోతుంది అంటూ సినిమా యూనిట్ నుంచి కొన్ని వార్తలైతే బయటికి వస్తున్నాయి… ఇక తెలుగు ప్రేక్షకులకు సంక్రాంతి పండుగ చాలా పెద్ద పండుగ కాబట్టి ఈ పండుగను పురస్కరించుకొని సంక్రాంతి పండుగ రోజు అంటే 15వ తేదీన సాయంత్రం 6:00కి ఈ సినిమా నుంచి ఒక అప్డేట్ ని వదలడానికి సినిమా యూనిట్ ప్రయత్నం చేస్తుందట. ఇక ఏది ఏమైనా కూడా మహేష్ బాబు మరొక లుక్కుని రిలీజ్ చేస్తారా? లేదంటే మరో చిన్న గ్లింప్స్ ని రిలీజ్ చేసే అవకాశం ఉందా? అనేది తెలియాల్సి ఉంది.
ఇక ఏది ఏమైనా కూడా ‘వారణాసి’ సినిమా వస్తుంది అంటే చాలు యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులంతా ఆ సినిమా కోసం ఆసక్తి ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు 5 క్యారెక్టర్లలో నటిస్తుండటం విశేషం… ప్రతి ఒక్క క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉంటుందని రాజమౌళి ఇంతకుముందు పలు సందర్భాల్లో తెలియజేశారు.
ఇక ఇలాంటి సందర్భంలోనే మహేష్ బాబు ఇప్పటివరకు డ్యూయల్ రోల్లో నటించిన సినిమాలైతే లేవు. కాబట్టి ఈ సినిమాలో ఐదు పాత్రల్లో ఎలా మెప్పిస్తాడు. ఒక్క క్యారెక్టర్ కి ఎలాంటి వేరియేషన్స్ చూపిస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది… ఇప్పటివరకు రాజమౌళి చేసిన సినిమాలన్నీ సూపర్ సక్సెస్ గా నిలవడంతో అతనికి ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపైతే ఉంది.
ఇక తనలాంటి స్టార్ డమ్ ను సంపాదించుకున్న దర్శకుడు ఇకమీదట చేయబోతున్న సినిమాల విషయంలో కూడా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు. మహేష్ బాబు సినిమాతో పాన్ వరల్డ్ లో ఉన్న దర్శకులందరికి పోటీని ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ఉన్నా ఆయన ఈ సినిమాని ఎలాగైనా సరే సూపర్ సక్సెస్ గా నిలపడానికి తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నాడు…