Sreeleela missed Anaganaga Oka Raju: నవీన్ పోలిశెట్టి హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా వచ్చిన ‘అనగనగా ఒక రాజు’ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మొదటి షో తోనే సక్సెస్ ఫుల్ టాక్ ను సంపాదించుకోవడం తో ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను దక్కించుకుంటుంది. ప్రస్తుతం ఈ సినిమాని చూడడానికి యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులంతా ఆసక్తిని చూపిస్తున్నారు. ఇక నవీన్ పోలిశెట్టి తను చేసే సినిమాలన్నింటిని సక్సెస్ ఫుల్ గా నిలపాలనే ఉద్దేశ్యంతో ఆచితూచి మరి కాన్సెప్ట్ లను ఎంచుకుంటున్నాడు. వాటి వల్ల సూపర్ సక్సెస్ లను కూడా సాధిస్తున్నాడు. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’, ‘జాతి రత్నాలు’, ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ లాంటి సినిమాలను చూస్తే అతని సినిమాల సెలక్షన్ ఏంటో మనకు చాలా స్పష్టంగా తెలుస్తోంది.
అనగనగా ఒక రాజు సినిమా కూడా ఫుల్ ఎంటర్టైన్మెంట్ ని అందించే సినిమాగా రావడమే కాకుండా ప్రేక్షకులందరిని మెప్పిస్తుంది… ఇక ఈ సినిమాలో మొదట హీరోయిన్ గా శ్రీలీలా ను తీసుకున్నారు. కానీ అనుకోని కారణాల వల్ల తను ఈ సినిమాను మిస్ చేసుకుంది. దీనివల్ల తనకి ఒక సక్సెస్ ఫుల్ సినిమా అయితే మిస్ అయింది. కాబట్టి తను ఈ సినిమాను మిస్ చేసుకున్నందుకు బాధపడుతున్నట్టుగా తెలుస్తుంది…
ఇక శ్రీలీల మీద ఐరన్ లెగ్ ముద్ర పడడం వల్ల చాలా సినిమాలు నుంచి ఆమె ను తప్పిస్తున్నారు. కొన్ని సినిమాల నుంచి తనే స్వయంగా తప్పుకుంటుంది. ఇక ఏది ఏమైనా కూడా ఇప్పుడు ఒక భారీ సక్సెస్ అయితే సాధించాల్సిన అవసరం ఉంది. లేకపోతే మాత్రం ఆమె ఇండస్ట్రీ నుంచి ఫేడ్ ఔట్ అయిపోవాల్సిన పరిస్థితి ఏర్పడనుంది…
ఇక అనగనగా ఒక రాజు సినిమా సక్సెస్ తో మీనాక్షి చౌదరి మరొక మెట్టు పైకి ఎక్కిందనే చెప్పాలి. గత సంవత్సరం సంక్రాంతికి ‘సంక్రాంతి వస్తున్నాం ‘ సినిమాతో భారీ సక్సెస్ ను అందుకున్న ఆమె ఇప్పుడు అనగనగా ఒక రాజు సినిమాతో మరో సక్సెస్ ని తన ఖాతాలో వేసుకుంది. ఈ సంక్రాంతికి సైతం తన హవాని కొనసాగిస్తూ ఉండడం విశేషం…