Woman Beats Husband: సంసారం అంటే.. చిన్న చిన్న అలకలు వస్తూనే ఉంటాయి.. ఏదో ఒక సందర్భంలో భర్త మీద భార్య, భార్య మీద భర్త అరవడం కామన్.. కొన్ని సందర్భాల్లో భర్తలు ఆగ్రహం తట్టుకోలేక భార్యలను కొడుతుంటారు.. కొందరైతే మరింత అగ్రహానికి గురై గాయపరుస్తుంటారు.
భార్యా భర్తలకు గొడవలకు సంబంధించిన దృశ్యాలు గతంలో అంతగా వెలుగులోకి వచ్చేవి కావు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ తరహా వీడియోలు విపరీతంగా కనిపిస్తున్నాయి. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా సర్కులేట్ అవుతోంది. ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ.. ఆ భర్తకు మాత్రం సోషల్ మీడియాలో విపరీతమైన సానుభూతి లభిస్తోంది. పాపం ఇతడి పరిస్థితి ఏంటి ఇలా అయిపోయిందని చాలామంది వ్యాఖ్యానిస్తున్నారు ..
సోషల్ మీడియాలో కనిపిస్తున్న ఆ వీడియో ప్రకారం భార్యా భర్తలు బైక్ మీద వెళ్తున్నారు. ఈ క్రమంలో భార్య భర్త తో గొడవ పడుతోంది. అతడిని విపరీతంగా తిడుతున్నది. దానికి ఆ భర్త నిశ్శబ్దంగా ఉంటున్నాడు. అతడు ఏమీ మాట్లాడక పోయేసరికి ఆమెలో ఆగ్రహం మరింత కట్టలు తెంచుకుంటున్నది.
వారిద్దరు ఎందుకు గొడవ పడుతున్నారో తెలియదు. కాకపోతే ఈ వ్యవహారాన్ని కొంతమంది వెనుక వైపు నుంచి వీడియో తీసి. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది కాస్త సంచలనంగా మారింది. ” ఇప్పటివరకు భార్యల మీద దాడి చేసిన భర్తలను చూసాం. కానీ ఇప్పుడు కాలం మారింది. భార్యలు భర్తల మీద దాడి చేస్తున్నారు . ఇష్టానుసారంగా విమర్శలు చేస్తున్నారు. కొన్ని సందర్భాలలో ఘోరంగా తిడుతున్నారు. ఈ సన్నివేశం చూస్తే భర్తలందరూ తల దించుకుంటారని” నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు ..
“ఇన్ని రోజులపాటు పురుషుల చేతిలో దెబ్బలు తిన్నాం. దాడులు చవి చూసాం. ఇకపై మాకు ఓపిక లేదు. కచ్చితంగా మా సత్తా ఏమిటో చూపిస్తాం. ఇది శాంపిల్ మాత్రమే .. మాకు కూడా సమాన హక్కులు ఉండాలి. మేం కూడా అన్ని విధాలుగా ఎదగాలి. ఆకాశంలో సగం.. అవకాశాలలో సగం. అనే నానుడిని నిజం చేసి చూపించేందుకు ఇలా చేస్తున్నామని” మహిళా నెటిజన్లు పేర్కొంటున్నారు.
Violence against men is a joke for people.
If a man were beating his wife, people would stop him.
There would be national outrage. But men’s lives have no value in this country.
Also, are women really the kinder gender? pic.twitter.com/EGjhdpfsso
— ︎ ︎venom (@venom1s) January 12, 2026