https://oktelugu.com/

భార్యలో నచ్చిన క్వాలిటీ అదే.. బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు..?

స్టార్ హీరో, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఆహా ఓటీటీలో సమంత హోస్ట్ చేస్తున్న సామ్ జామ్ షోకు గెస్ట్ గా హాజరైన సంగతి తెలిసిందే. ఈ నెల 1వ తేదీ నుంచి అల్లు అర్జున్ కు సంబంధించిన ఎపిసోడ్ ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేసి వాళ్ల సీక్రెట్లను బయటపెట్టిన సమంత ఈ షో ద్వారా అల్లు అర్జున్ లైఫ్ కు సంబంధించిన ఎన్నో సీక్రెట్లను ప్రేక్షకులకు తెలిసేలా చేశారు. Also […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 3, 2021 / 03:02 PM IST
    Follow us on


    స్టార్ హీరో, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఆహా ఓటీటీలో సమంత హోస్ట్ చేస్తున్న సామ్ జామ్ షోకు గెస్ట్ గా హాజరైన సంగతి తెలిసిందే. ఈ నెల 1వ తేదీ నుంచి అల్లు అర్జున్ కు సంబంధించిన ఎపిసోడ్ ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేసి వాళ్ల సీక్రెట్లను బయటపెట్టిన సమంత ఈ షో ద్వారా అల్లు అర్జున్ లైఫ్ కు సంబంధించిన ఎన్నో సీక్రెట్లను ప్రేక్షకులకు తెలిసేలా చేశారు.

    Also Read: ఆచార్యలో చరణ్ లుక్ ఇదే… సోషల్ మీడియాలో వైరల్..?

    అల్లు అర్జున్ స్నేహారెడ్డి ఒకరినొకరు ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న సంగతి విదితమే. స్నేహారెడ్డిలో నచ్చిన క్వాలిటీ ఏమిటని సమంత ప్రశ్నించగా బన్నీ స్నేహలో డిగ్నిటీ అంటే ఎంతో ఇష్టమని వెల్లడించారు. స్నేహను తొలిసారి ఒక నైట్ క్లబ్ పార్టీలో రాత్రి 2 గంటల సమయంలో చూశానని.. ఆ సమయంలో కూడా స్నేహ ఎంతో డిగ్నిటీతో కనిపించిందని అన్నారు. ఇంట్లో ఉంటే ఎక్కువ సమయం అయాన్ తోనే ఉంటానని తెలిపారు.

    Also Read: సింగర్ గా మారుతున్న వింక్ బ్యూటీ.. గాత్రంతో మాయ చేస్తుందా..?

    అయాన్ కు ఫోటోలు, కెమెరాలు అంటే ఎక్కువగా నచ్చవు కాబట్టే అర్హతో దిగిన ఫోటోలు, వీడియోలు ఎక్కువగా బయటకు వస్తుంటాయని బన్నీ అన్నారు. తనకు అయాన్ అంటే కూడా చాలా ఇష్టమని కానీ అందరూ అర్హ అంటే ఇష్టమని భావిస్తారని తెలిపారు. 2020 సంవత్సరం గురించి స్పందిస్తూ 2020లో తనకు అల వైకుంఠముపురలో లాంటి సూపర్ హిట్ వచ్చిందని బన్నీ తెలిపారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    వెంటనే సమంత సూపర్ హిట్టా..? అని ప్రశ్నించగా బ్లాక్ బస్టర్, ఇండస్ట్రీ హిట్ అని అల్లు అర్జున్ అన్నారు. అల్లు స్టూడియోస్ గురించి స్పందిస్తూ ఒకరోజు అన్నపూర్ణ స్టూడియోస్ కు వెళుతుంటే సెక్యూరిటీ గార్డ్ వెల్కమ్ టు అన్నపూర్ణ సెవన్ ఎకర్స్ అని చెప్పాడని.. అప్పుడు మాక్కూడా కూడా స్టూడియో ఉంటే బాగుంటుందని అనిపించిందని అలా అల్లు స్టూడియోస్ కు బీజం పడిందని అల్లు అర్జున్ తెలిపారు.