Ramayana Movie: రీసెంట్ గా విడుదలైన నితీష్ తివారీ ‘రామాయణ’ చిత్రం మొదటి ఆట నుండే అద్భుతమైన పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకోండి , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తుందో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. ఫుల్ రన్ లో కచ్చితంగా ఈ చిత్రం 2 వేల కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబడుతుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఆ స్థాయిలో బాక్స్ ఆఫీస్ విద్వంసం కొనసాగుతోంది. ఇప్పటి వరకు ‘బాహుబలి 2’ ఫుల్ రన్ గ్రాస్ ని ఒక్క సినిమా కూడా అందుకోలేకపోయింది. ‘ధురంధర్ 2’, ‘పుష్ప 2’ చిత్రాలు చాలా దగ్గరకు వచ్చాయి కానీ , బాహుబలి 2 ని బీట్ చేయలేకపోయాయి. కానీ ‘రామాయణ’ చిత్రానికి ఆ స్కోప్ ఉందని , ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాని చూసేందుకు ఎగబడుతారని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.
ఇకపోతే ఈ చిత్రం లో లక్ష్మణుడు క్యారక్టర్ పై సోషల్ మీడియా లో ఆసక్తికరమైన కథనం ఒకటి నడుస్తోంది. ఈ పాత్రని రవి దూబే పోషించిన సంగతి తెలిసిందే. అయితే వాస్తవానికి ఈ పాత్ర కోసం ముందుగా మన టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ ని సంపారించారట మేకర్స్. కానీ డేట్స్ అందుబాటులో లేకపోవడం తో ఆయన ఈ పాత్ర చేయలేకపోయాడట. ఒకవేళ నిఖిల్ ఒప్పుకొని ఈ పాత్ర చేసుంటే చాలా బాగుండేదని , ఆయనకు బాలీవుడ్ లో మంచి పాపులారిటీ వచ్చేదని అంటున్నారు. ఇప్పటికే నిఖిల్ ‘కార్తికేయ 2’ చిత్రం తో బాలీవుడ్ ఆడియన్స్ కి దగ్గరయ్యాడు. ఎలాంటి అంచనాలు లేకుండా బాలీవుడ్ లో విడుదలైన ఆ సినిమాకు దాదాపుగా 50 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఒకవేళ ఈ చిత్రం ఒప్పుకొని చేసుంటే నిఖిల్ తదుపరి చిత్రం ‘స్వయంభు’ కి బాలీవుడ్ లో మంచి హైప్ క్రియేట్ అయ్యేదని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.