Bigg Boss 10 Telugu: ఈ వారం బిగ్ బాస్ హౌస్ కి కొత్త కెప్టెన్ గా టెంపర్ వంశీ నిలిచాడు. దీంతో అతని స్నేహితుడు త్రిగున్ సంబరాలు చేసుకున్నాడు. ఆనందంతో టెంపర్ వంశీ ని పైకి ఎత్తుకొని ఇల్లు మొత్తం తిప్పాడు. అందుకు సంబంధించిన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఇకపోతే నిన్నటి టాస్క్ లో ముకేశ్, వర్షిణి జంట గెలిచినా సంగతి అందరికీ తెలిసిందే. కానీ వీళ్ళిద్దరిలో కేవలం ఒకరికి మాత్రమే ఫ్యామిలీ వీక్ ఉంటుంది. కేవలం ఒకరి కుటుంబానికి మాత్రమే బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంటుందని చెప్పడం తో , వర్షిణి ముకేశ్ కోసం తన ఫ్యామిలీ వీక్ ని త్యాగం చేసింది. అయితే ఈ వారం వర్షిణి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. అదే కనుక జరిగితే ముకేశ్ హౌస్ లో ఒంటరి వాడు అయిపోతాడని , ఇతన్ని కూడా ఎదో ఒక వారం రోహిత్ ని ఎలిమినేట్ చేసినట్టుగా హౌస్ మేట్స్ ఓట్లతో ఎలిమినేట్ చేసే ప్రమాదం ఉందని అంటున్నారు నెటిజెన్స్.
ఇకపోతే ఈ వారం జరిగిన నామినేషన్స్ లో వంశీ ఏ రేంజ్ లో నోరు జారాడో అందరికీ తెలిసిందే. అతను మాట్లాడిన మాటల తీరుకి రెడ్ కార్డు ఇవ్వాలంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ డిమాండ్ చేస్తున్నారు. అయితే కాసేపటి క్రితమే శనివారం , ఆదివారానికి సంబంధించిన ఎపిసోడ్స్ చిత్రీకరణ మొదలైంది. శనివారం రోజున వంశీ , దేబ్జాని లకు నాగార్జున కోటింగ్ వేరే లెవెల్ లో ఇచ్చాడని అంటున్నారు. వీళ్లిద్దరికీ కోటింగ్ అసలు సరిపోదని , ఎల్లో కార్డు ఇవ్వాలని నెటిజెన్స్ డిమాండ్ చేస్తున్నారు. రోహిత్ ఏ చిన్న తప్పు చేసినా ఎల్లో , బ్లాక్ కార్డు అంటూ రకరకాల కార్డులను కనిపెట్టి ఇచ్చిన నాగార్జున , సెలబ్రిటీలు ఇన్ని తప్పులు చేస్తున్నా వాళ్ళని ఎందుకు వదిలేస్తున్నాడో అర్థం కావడం లేదంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.