Star heroes sons: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు స్టార్ హీరోలుగా వెలుగొందుతున్నారు. ఒకప్పుడు చాలామంది స్టార్ హీరోలు వాళ్ళ తరం ముగిసిన తర్వాత వాళ్ళ వారసులను ఇండస్ట్రీకి పరిచయం చేసి వరుస సినిమాలను చేయిస్తూ వచ్చారు.ఇక వాళ్ళకి బుస్టాప్ ఇవ్వడానికి వల్ల సినిమాల్లో మన స్టార్ హీరోలు నటించి మెప్పించేవారు. మరి ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసినప్పటికి యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది స్టార్ హీరోలు వాళ్ళ వారసుల సినిమాల్లో నటించినప్పటికి వాళ్ళకి సరైన సక్సెస్ లను ఇవ్వలేకపోయారు. ముఖ్యంగా మహేష్ బాబు లాంటి నటుడు సూపర్ స్టార్ కృష్ణ నట వారసత్వం నుంచి వచ్చాడు. ఇక వీళ్లిద్దరూ కలిసి చేసిన వంశీ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. తద్వారా వాళ్ళ కొడుకుకి భారీ సక్సెస్ ని అందించాలి అనుకున్న కృష్ణ సక్సెస్ ని ఇవ్వలేకపోయాడు…
Also Read: కింగ్ డమ్ ఫస్ట్ రివ్యూ వచ్చేసిందిగా… విజయ్ నామ సంవత్సరం స్టార్ట్ అవ్వనుందా..?
మోహన్ బాబు లాంటి నటుడు సైతం తన కొడుకు అయిన మనోజ్ చేసిన మొదటి సినిమా శ్రీ లో నటించాడు. అయినప్పటికి ఆ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని అయితే సాధించలేదు…అలాగే విష్ణు హీరోగా వచ్చిన గేమ్ సినిమాలో కూడా మోహన్ బాబు ఒక కీలక పాత్రలో నటించాడు.
అయినప్పటికి అది కూడా హిట్ అవ్వలేదు. ఇక అక్కినేని ఫ్యామిలీ నుంచి మూడోతరం హీరోగా వచ్చిన అఖిల్ (Akhil) మొదటి సినిమాలో నాగార్జున ఒక సాంగ్ లో కనిపిస్తాడు. అయితే ఈ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని అయితే సాధించలేదు. మొదటి సినిమాతోనే బొక్క బోర్లా పడ్డ అఖిల్ అప్పటినుంచి ఇప్పటివరకు కోలుకోవడం లేదు… యంగ్ రెబల్ స్టార్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న ప్రభాస్ మంచి సక్సెస్ లను సాధించినప్పటికి వాళ్ళ పెద్దనాన్న అయిన కృష్ణంరాజుతో చేసిన బిల్లా(Billa), రెబల్ (Rebal) సినిమాలు ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేకపోయాయి…
Also Read: కమల్ కి సక్సెస్ ఇచ్చిన లోకేష్ కనకరాజు.. రజినీని ఏం చేస్తాడో..?
ఇలా మన స్టార్ హీరోలందరు వాళ్ళ వారసులకు భారీ సక్సెస్ లను అందించాలనే ప్రయత్నం చేసినప్పటికి ఆ సినిమాలు పెద్దగా సక్సెస్ అయితే సాధించలేదు…ఇక ఏది ఏమైనా కూడా సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ సాధించిన వాళ్ళకే ఎక్కువ క్రేజ్ అయితే దక్కుతోంది. ఇక దాన్ని బేస్ చేసుకొని వాళ్ళ మార్కెట్ పెరుగుతోంది. తద్వారా వాళ్ళ దగ్గరికి స్టార్ట్ డైరెక్టర్లు సైతం మంచి కథను పట్టుకొని వస్తూ ఉంటారు. మరి ఇలాంటి సందర్భంలో ఇప్పుడిప్పుడే వస్తున్న యంగ్ హీరోలు మంచి విజయాలను సాధిస్తుంటే మరి కొంత మంది నట వారసులు మాత్రం సరైన సక్సెస్ లేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు…