Kingdom movie first review: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి కాన్సెప్ట్ తో సినిమాలో వస్తున్నాయి. ఇక ప్రస్తుతం పాన్ ఇండియాలో పెను సంచలనాలను క్రియేట్ చేస్తున్న మనవాళ్ళు యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని శాసిస్తుందనే చెప్పాలి…ఇక ఇప్పటివరకు ఏ హీరో ఎలాంటి సినిమాలు చేస్తూ వచ్చినప్పటికి ఇకమీదట వాళ్ళు చేయబోయే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అర్జున్ రెడ్డి(Arjun Reddy) సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోయిన విజయ్ దేవరకొండ ఆ తర్వాత తను ఏమాత్రం మ్యాజిక్ ని చేయలేకపోయాడు. దాంతో ఇప్పుడు చేస్తున్న ‘కింగ్ డమ్’ సినిమాతో మరోసారి భారీ సక్సెస్ ని సాధించాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద నాగ వంశీ నిర్మిస్తున్న ఈ సినిమాకి గౌతమ్ తిన్ననూరు (Goutham Thinnanuri) దర్శకత్వం వహించడం విశేషం…ఇక ఈ సినిమా నుంచి మొదట్లో వచ్చిన గ్లింప్స్ ప్రేక్షకుల్లో ఒక అటెన్షన్ ని క్రియేట్ చేసింది. దానికి తగ్గట్టుగా రీసెంట్ గా వచ్చిన సాంగ్స్ గాని, టీజర్ గాని ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
Also Read: కమల్ కి సక్సెస్ ఇచ్చిన లోకేష్ కనకరాజు.. రజినీని ఏం చేస్తాడో..?
అయితే ఈ సినిమా ఈనెల 31వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఎలాగైనా సరే ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించాలని అటు విజయ్ దేవరకొండ ఇటు గౌతమ్ తిన్ననూరి భావిస్తున్నారు.అయితే ఈ సినిమాకి సంబంధించిన మొదటి రివ్యూ అయితే వచ్చేసింది. ఇప్పటికే ఈ సినిమాని కొంతమంది ప్రముఖుల కైతే చూపించారట. ఇక వాళ్ళు చెబుతున్న దాన్ని బట్టి చూస్తే ఈ సినిమా ఒక రివేంజ్ డ్రామాగా తెరకెక్కింది.
ముఖ్యంగా బ్రదర్స్ మధ్య ఉండే సెంటిమెంట్ ని హైలెట్ చేస్తూ రివెంజ్ డ్రామాగా తెరకెక్కినట్టుగా తెలుస్తోంది. మరి ఈ సినిమాతో విజయ్ దేవరకొండ నెక్స్ట్ లెవెల్ కి వెళ్తాడా? ఆయన ఈ సినిమాతో భారీ మేజిక్ ను క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…అయితే కథ కూడా చాలా ఫ్రెష్ గా ఉంది. దానికి తగ్గట్టుగానే గౌతమ్ తెలుగులోనే మొదటిసారి యాక్షన్ ఎంటర్ టైనర్ లను చేస్తున్నాడు.
Also Read: పోకిరి సినిమాను ఆ మూవీ నుంచి కాపీ చేశారు…
కాబట్టి ఆయన కూడా చాలా ఫ్రెష్ ఫీల్ తో ఈ సినిమా నడిపించినట్టుగా తెలుస్తోంది… విజయ్ దేవరకొండ బ్రదర్ గా సత్యదేవ్ నటిస్తున్నాడు. మరి వీళ్ళిద్దరి కాంబినేషన్ కూడా స్క్రీన్ మీద బాగా వర్కౌట్ అయినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ ఈ సినిమాకి చాలా ప్లస్ అయిందని ఈ సినిమాని చూసిన ప్రముఖులు కొంతమంది తెలియజేస్తుండటం విశేషం…