Lokesh Kanagaraj Rajinikanth: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth)కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎవరికి దక్కనటువంటి గొప్ప క్రేజ్ ను సంపాదించుకున్న నటుడు కూడా తనే కావడం విశేషం… తన స్టైల్ తో ప్రేక్షకులందరిని మెప్పించడమే కాకుండా తన డైలాగ్ డెలివరీతో ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తనవైపు తిప్పుకున్నాడు. ప్రస్తుతం 70 సంవత్సరాల పైబడిన వయసులో కూడా యంగ్ హీరోలకు పోటీని ఇస్తూ సినిమాలు చేస్తున్నాడు అంటే ఆయనకు సినిమాల మీద ఉన్న ఇంట్రెస్ట్ ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు…యంగ్ హీరోల కంటే కూడా శరవేగంగా సినిమాను పూర్తి చేస్తూ చాలా ఫాస్ట్ గా రిలీజ్ చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నాడు. లోకేష్ కనకరాజు(Lokesh Kanakaraj) దర్శకత్వంలో ఆయన చేసిన కూలీ (Cooli) సినిమా ఆగస్టు 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ రివ్యూ అయితే వచ్చేసింది. ఈ సినిమా అద్భుతంగా ఉంది అంటూ కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. నిజానికి లోకేష్ కనకరాజు హాలీవుడ్ స్టైల్ మేకింగ్ అయితే సినిమా జనాలకు చూపించాలనే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇక ఇందులో కూడా అదే చేశాడు అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: పోకిరి సినిమాను ఆ మూవీ నుంచి కాపీ చేశారు…
కథ కూడా ఈ సినిమాకి బాగా సెట్ అయిందని అందువల్లే ఈ సినిమాలో రజనీకాంత్ తన యాక్టింగ్ తో సినిమా మొత్తాన్ని తన భుజాల మీద మోసుకెళ్లాడు అంటూ ఇంకొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఇక నాగార్జున పాత్ర కూడా అద్భుతంగా ఉందని చెబుతున్నారు. నాగార్జున నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో నటించాడట…
మరి నాగార్జున చేసిన ఈ పాత్ర సినిమా మొత్తానికి హైలైట్ కాబోతుంది అంటు కొన్ని వార్తలైతే వస్తున్నాయి. మరి ఏది ఏమైనా కూడా లోకేష్ కనకరాజు ఈ సినిమాతో భారీ కంబ్యాక్ ఇవ్వబోతున్నాడు అంటూ మరి కొంతమంది చెబుతున్నారు. మొత్తానికైతే కొంతమంది సినిమా ఇండస్ట్రీలో ఉన్నవాళ్లకి స్పెషల్ ప్రీవ్యూ అయితే వేశారు.
Also Read: ‘జూనియర్’ కి శ్రీలీల అందుకున్న రెమ్యూనరేషన్ తో ఒక సినిమానే తియ్యొచ్చు తెలుసా!
ఇక దాని ఆధారంగానే ఈ సినిమా రివ్యూ అనేది బయటికి వచ్చేసింది. మొత్తానికైతే సినిమా సగటు ప్రేక్షకుడిని ఇంప్రెస్ చేసేలా ఉందని ఇండియాలో ఉన్న చాలా రికార్డులు ఈ సినిమా ద్వారా బ్రేక్ అయిపోతాయి అంటూ చెబుతుండడం విశేషం…ఇక లోకేష్ కనకరాజ్ సైతం కమల్ హాసన్ కి విక్రమ్ తో ఎలాంటి బ్లాక్ బస్టర్ అయితే ఇచ్చాడో, రజినీకాంత్ కి కూడా అలాంటి ఒక భారీ సక్సెస్ ను ఇవ్వబోతున్నాడు అంటూ రజినీకాంత్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు…