Wooden boat : ఎవడబ్బ సొత్తు కాదు టాలెంట్.. నీ దమ్మెంతో ఉందో చూపించు ముందు.. ప్రపంచాన్ని ఏలేయ్.. ప్రపంచం ముందు నీ పాదం మోపేయ్.. పాపులర్ తెలుగు సినిమాలో విజయవంతమైన పాట ఇది. ఎవడి అండదండలు లేకున్నా.. ఎటువంటి వైల్డ్ కార్డు లేకున్నా.. టాలెంట్ ఉంటే ఎదగొచ్చని.. అద్భుతాలు సృష్టించవచ్చని ఆ పాట ద్వారా చెప్పే ప్రయత్నం దర్శకుడు చేశాడు.. అప్పట్లో అది చాలామందికి నచ్చింది కూడా. ఇప్పుడు ఈ ప్రస్తావని ఎందుకంటే.. ఈ స్టోరీ చదవండి మీకే తెలుస్తుంది..
View this post on Instagram
ఆ బాలుడు ఇప్పుడిప్పుడే టీనేజ్ లోకి వస్తున్నాడు. చదువులో మెరిక. ఉండేది ఇండోనేషియాలో.. అతడికి చిన్నప్పటినుంచి పడవల మీద ప్రయాణించడం అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టాన్ని తల్లిదండ్రులు కాదనలేకపోయారు. సమయం దొరికితే చాలు అతడిని పడవ ప్రయాణానికి తీసుకెళ్లేవారు. పడవ ప్రయాణం చేయడం మాత్రమే కాదు.. పడవ ముందు కూర్చుని తనదైన హావభావాలు ప్రదర్శించడం ఆ బాలుడికి చిన్నప్పటినుంచే అలవాటయింది. దీంతో దానిని అతడు ఒక వ్యాపకం లాగా మార్చుకున్నాడు. అది అతడి స్థాయిని ఎక్కడికో తీసుకెళ్ళింది.. తన తోటి పిల్లలు పాఠశాలకు వెళ్తుంటే.. అతడు మాత్రం ఒక దేశానికి రాయబారిగా మారాడు.. అతడు పడవ ప్రయాణంలో చూపిస్తున్న హావభావాలు సోషల్ మీడియాలో పడి వైరల్ అయ్యాయి. ఇటీవల ఇండోనేషియా ప్రాంతంలో జరిగిన పడవ పోటీలలో ఆ బాలుడు తనదైన శైలిలో హావభావాలను ప్రదర్శించాడు. ఎటువంటి అవాంతరాలు ఉన్నా దూసుకుపోవాలని.. అడ్డంకులు ఉన్నా దాటి పోవాలని.. ఇబ్బందులను లెక్కపెట్టొద్దని.. కష్టాలను పరిగణలోకి తీసుకోవద్దని అతడు తన సంకేతాల ద్వారా నిరూపించాడు. ఇది చాలామందికి నచ్చింది. అంత చిన్న వయసులోనే ఇంతటి పరిపక్వత అంటూ చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అంతేకాదు అతని ప్రతిభను వివిధ మాధ్యమాలలో పోస్ట్ చేశారు. అతడు ఒక్కసారిగా చర్చనీయాంశమైన వ్యక్తుల జాబితాలోకి వెళ్లిపోయాడు.
అతని ప్రతిభను చూసిన ఇండోనేషియా ప్రభుత్వం.. రియావు ప్రావిన్స్ అధికార రాయబారిగా నియమించింది. ఏకంగా 20 లక్షల ఇండోనేషన్ రూపాయలను అతడికి ఉపకార వేతనంగా ప్రకటించింది. అతడిని రాయబారిగా నియమించడం వల్ల రియావు ప్రాంతం పర్యాటకంగా వెలుగొందుతుందని ఇండోనేషియా ప్రభుత్వం నమ్ముతోంది. అతని ప్రయాణం ద్వారా రియావు ప్రాంతం సాంస్కృతికంగా సరికొత్త గుర్తింపు తెచ్చుకుంటుందని భావిస్తున్నది. ” సహజ సౌందర్యానికి రియావు ప్రాంతం పెట్టింది పేరు. ఇక్కడ నది జలాలు విస్తారంగా ఉంటాయి. అవి పర్యాటకులకు ఉపశమనం గా ఉంటాయి. ఇలాంటి ప్రాంతాలలో పడవ పోటీలు పర్యాటకులకు సరికొత్త అనుభూతినిస్తాయి. ఆ బాలుడి ఆధ్వర్యంలో పడవ పోటీలు గనుక నిర్వహిస్తే ఉపయోగంగా ఉంటుంది. పైగా పర్యాటకంగా ప్రాచుర్యం కూడా లభిస్తుంది. అలాంటప్పుడు ఇతడిని రాయబారిగా నియమించడం మంచిదే కదా. పైగా అతడు చదువుకుంటున్నాడు. పరిపక్వ స్థితిలో ఉన్నాడు. అతడు చదువుకు అవసరమైన ఉపకార వేతనాన్ని ప్రభుత్వం అందించింది. అలాంటప్పుడు అతడి చదువుకు ఎటువంటి ఆటంకాలు ఉండవు. అతడి ద్వారా రియావు ప్రాంతం పర్యాటకంగా మరింత గుర్తింపును తెచ్చుకుంటుంది. అంతేకాదు ఆ బాలుడి ద్వారా చాలామంది స్ఫూర్తి పొందుతారు. గొప్పగా సాధించాలనే కలను నెరవేర్చుకుంటారని” ఇండోనేషియా ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు.