Shiva Re Release: అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) కెరీర్ లోనే కాదు, తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఒక మైలు రాయి లాంటి చిత్రం ‘శివ'(Siva Re Release). అప్పటి వరకు లవ్ స్టోరీస్ తో ఆడియన్స్ ని అలరిస్తూ వచ్చిన నాగార్జున, ఒక్కసారిగా ఇలాంటి మాస్ సినిమా చేయడం, అది టాలీవుడ్ లో ట్రెండ్ సెట్టింగ్ సినిమాగా నిలిచి, ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలవడం, నాగార్జున స్టార్ హీరో గా ఈ సినిమా నుండే మారడం, అన్నీ అలా చకచకా జరిగిపోయాయి. అప్పటి వరకు టాలీవుడ్ లోనే కాదు, ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లోనే ఇలాంటి సినిమా రాలేదు. రొటీన్ రివెంజ్ డ్రామాలు, ఫ్యామిలీ డ్రామాలు, ఇలాంటివే ఉండేవి. కానీ మొట్టమొదటిసారి ఫిలిం మేకింగ్ లో సరికొత్త సంస్కరణలు ఈ చిత్రం ద్వారా తీసుకొచ్చాడు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. ఆయన షాట్ మేకింగ్ ఐడియాస్, హాలీవుడ్ సినిమాల్లో కూడా లేవు, అలాంటి షాట్స్ ని ఈ చిత్రం లో పెట్టాడు.
Also Read: ఆస్ట్రేలియాకు షాక్ ఇచ్చిన టీమిండియా.. ఇదీ సూర్య భాయ్ వ్యూహ చతురత!
రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు ఎన్ని ఫ్లాప్ సినిమాలు తీసినా, ఆయన్ని ఆడియన్స్ ఎందుకు ఇంకా గౌరవిస్తున్నారు అంటే అందుకు సమాధానం శివ సినిమానే. తెలుగు చలన చిత్ర పరిశ్రమని రెండుగా విభజించాలంటే, శివకి ముందు, శివ కి తర్వాత అని చెప్పొచ్చు. ఆ రేంజ్ సునామీ ని సృష్టించిన చిత్రమిది. ఆరోజుల్లోనే 4 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, తమిళం, హిందీ భాషల్లోకి కూడా డబ్ అయ్యి సూపర్ హిట్ గా నిల్చింది. ఒక్కమాటలో చెప్పాలంటే మన టాలీవుడ్ నుండి మొట్టమొదటి పాన్ ఇండియన్ సినిమా ‘శివ’. అలాంటి చిత్రాన్ని లేటెస్ట్ 4K మరియు డాళ్బీ అట్మాస్ సౌండ్ మిక్సింగ్ తో ఈ నెల 14న అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా గ్రాండ్ గా రీ రిలీజ్ చేయబోతున్నారు.
ఈ రీ రిలీజ్ కి మేకర్స్ మామూలు హైప్ ఇవ్వడం లేదు. టాలీవుడ్ కి సమందించిన పాన్ ఇండియన్ హీరోలు, పాన్ ఇండియన్ డైరెక్టర్స్ అందరూ స్పెషల్ గా వీడియో బైట్స్ చేస్తూ, ఈ చిత్రం గొప్పదనం గురించి చెప్పుకొచ్చారు. ఒక్క పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ తప్ప, స్టార్ హీరోలందరూ ఈ సినిమా రీ రిలీజ్ గురించి మాట్లాడారు. రాజమౌళి, సందీప్ వంగ, మణిరత్నం లాంటి స్టార్ డైరెక్టర్స్ కూడా శివ అనుభవాలను పంచుకున్నారు. ఇంతటి హైప్ ని క్రియేట్ చేసుకున్న ఈ చిత్రం, రీ రిలీజ్ లో బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టిస్తుందా?, ఆల్ టైం రికార్డు ని నెలకొల్పే అవకాశాలు ఉన్నాయా, లేవా అనేది చూడాలి. అడ్వాన్స్ బుకింగ్స్ ఈ వారం లోనే ప్రారంభించనున్నారు. చూడాలి మరి అక్కినేని ఫ్యాన్స్ పవర్ ఎలా ఉండబోతుంది అనేది.
