Samuthirakani Bro 2: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) అభిమానులు తమ అభిమాన హీరో సినిమాల్లో అసలు ఇష్టపడని సినిమాల లిస్ట్ తీస్తే అందులో ‘బ్రో ది అవతార్’ చిత్రం కచ్చితంగా ఉంటుంది. మామూలు ఆడియన్స్ కి ఈ చిత్రం పర్వాలేదు అని అనిపించొచ్చు. కానీ ఫ్యాన్స్ కి మాత్రం థియేటర్స్ లో ఈ చిత్రం నరకం చూపించింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి తగ్గ సినిమా కాదు ఇది. టాలీవుడ్ లో ఏ స్టార్ హీరో కూడా ఇలాంటి కథలను తమ దరిదాపుల్లోకి కూడా రానివ్వరు. 2023 వ సంవత్సరం లో విడుదలై డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రానికి 70 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు, 120 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇది రీసెంట్ గా విడుదలైన పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ మొదటి రోజు వసూళ్ల కంటే తక్కువ.
Also Read: ‘శివ’ రీ రిలీజ్ కోసం టాలీవుడ్ స్టార్ హీరోలు..కలెక్షన్స్ ఏ రేంజ్ లో రావొచ్చంటే!
మొదటి రోజు 150 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్ల ఓపెనింగ్ ని పెట్టగలిగే సత్తా ఉన్న పవన్ కళ్యాణ్ లాంటి సూపర్ స్టార్ చేయాల్సిన సినిమా కాదు ఇది అనేది అభిమానుల అభిప్రాయం. అయితే డైరెక్టర్ సముద్ర ఖని ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని, స్క్రిప్ట్ రెడీ గా ఉందని, పవన్ కళ్యాణ్ ఓకే చెప్పగానే ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్తుందని సంచలన ప్రకటన చేసాడు. నేడు ఈయన కీలక పాత్ర పోషించిన ‘కాంతా’ మూవీ థియేట్రికల్ ట్రైలర్ విడుదలైంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో విలేఖరులు అడిగిన ప్రశ్నకు సముద్ర ఖని ఇచ్చిన సమాధానం ఇది. ఈ వీడియో సోషల్ మీడియా లో రాగానే అభిమానులు సముద్ర ఖని ని ట్యాగ్ చేసి, ఇప్పుడిప్పుడే మా హీరో మళ్లీ లైన్ లోకి వచ్చాడు. దయచేసి మమ్మల్ని వదిలేయ్ అంటూ ప్రాధేయపడుతున్నారు.
అయితే పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు కథ ని వినేందుకు అప్పోయింట్మెంట్ ఇవ్వలేదని టాక్. అంతే కాదు, కొంతమంది అయితే ఈ కథ ని రిజెక్ట్ చేసాడు అనే టాక్ కూడా నడుస్తోంది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రెండు సంవత్సరాలకు ఒక సినిమా చేసినా, ఓజీ లాంటి భారీ సినిమానే చెయ్యాలని ఫిక్స్ అయ్యాడట. ఎందుకంటే తన మార్కెట్ స్థాయి ని, తన నుండి అభిమానులు ఎలాంటి సినిమాలు కోరుకుంటున్నారు అనేది ఓజీ చిత్రం ద్వారానే తెలిసింది అట. సముద్ర ఖని అయితే తన బ్రో 2 స్క్రిప్ట్ ని పవన్ కళ్యాణ్ అంగీకరిస్తాడు అనే నమ్మకం తో ఉన్నాడు. ఆయన నమ్మకం ఎంత వరకు నిజం అవుతుందో చూడాలి.
“Bro 2 is ready, waiting for #PawanKalyan sir’s permission to take off.” pic.twitter.com/68G1GTcCPG
— Gulte (@GulteOfficial) November 6, 2025