https://oktelugu.com/

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ 8 లోకి కంటెస్టెంట్ గా టాలీవుడ్ స్టార్ కమెడియన్..ఇది నిజంగా ఎవ్వరూ ఊహించనిది!

ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో కమెడియన్ గా నటించి, హీరో స్థాయికి ఎదిగిన అభినవ్ కి ఈమధ్య కొద్దిగా అవకాశాలు తగ్గాయి. అయితే అభినవ్ లాంటి కామెడీ టైమింగ్ ఉన్న నటులు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెడితే ఆడియన్స్ మంచి ఎంటర్టైన్మెంట్ పొందుతారు అనే ఉద్దేశ్యంతో బిగ్ బాస్ టీం రీసెంట్ గానే ఆయన్ని కలిశారట.

Written By:
  • Vicky
  • , Updated On : August 19, 2024 / 04:58 PM IST

    Bigg Boss 8 Telugu(9)

    Follow us on

    Bigg Boss 8 Telugu: త్వరలో స్టార్ మా ఛానల్ లో ప్రసారమయ్యే బిగ్ బాస్ సరికొత్త సీజన్ కి సంబంధించి సోషల్ మీడియా లో రోజుకు ఒక కొత్త వార్త ప్రచారం అవుతూ ఉంది. ఇప్పటి వరకు ఈ సీజన్ లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ గురించి పలు రకాల వార్తలు వినే ఉంటాము. వాళ్లంతా దాదాపుగా ఖరారు అయ్యినట్టే. తేజస్విని గౌడ, ప్రేరణ కంభం, కిరాక్ ఆర్ఫీ, జబర్దస్త్ నరేష్, రీతూ చౌదరీ, ఇంద్ర నీల్, అంజలి పవన్, బంచిక్ బబ్లూ, ఆదిత్య ఓం వీళ్లంతా కంటెస్టెంట్స్ గా ఖరారైన వారిలో ఉన్నారు. వీళ్ళు కాకుండా లేటెస్ట్ గా ఇప్పుడు మరికొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి. వారిలో ప్రముఖ కమెడియన్ అభినవ్ గోమటం కూడా ఉన్నాడు. ఈయన ‘ఈ నగరానికి ఏమైంది’ అనే చిత్రం లో కమెడియన్ గా టాలీవుడ్ కి పరిచయమయ్యాడు.

    Bigg Boss 8 Telugu(10)

    ఈయన ఈ చిత్రం లో వాడిన డైలాగ్స్ ‘మస్త్ షేడ్స్ ఉన్నాయ్ రా నీలో’, ‘అబ్బా కమల్ హాసన్’ వంటి డైలాగ్స్ మీమ్స్ లో ఏ రేంజ్ పాపులర్ అయ్యాయో మనమంతా చూసాము. అంతే కాకుండా ఈయన ఒక హీరో గా నటించిన ‘సేవ్ ది టైగర్స్’ వెబ్ సిరీస్ డిస్నీ + హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అయ్యి పెద్ద బ్లాక్ బస్టర్ గా నిల్చింది. ఆ తర్వాత ఈయన ‘కిస్మత్’, ‘మస్త్ షేడ్స్ ఉన్నాయి రా నీలో’ వంటి చిత్రాల్లో హీరో గా నటించాడు. అవి అనుకున్న స్థాయిలో ఆడలేదు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో కమెడియన్ గా నటించి, హీరో స్థాయికి ఎదిగిన అభినవ్ కి ఈమధ్య కొద్దిగా అవకాశాలు తగ్గాయి. అయితే అభినవ్ లాంటి కామెడీ టైమింగ్ ఉన్న నటులు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెడితే ఆడియన్స్ మంచి ఎంటర్టైన్మెంట్ పొందుతారు అనే ఉద్దేశ్యంతో బిగ్ బాస్ టీం రీసెంట్ గానే ఆయన్ని కలిశారట. అందుకోసం ఆయనకీ భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ కూడా ఆఫర్ చేసినట్టు తెలుస్తుంది. ఎలాగో ఇప్పుడు సినిమాలు లేవు కాబట్టి, ఈ ఖాళీ సమయాన్ని బిగ్ బాస్ కి కేటాయించాలనే ఉద్దేశ్యంతో అభినవ్ ఉన్నట్టు, ఆయన ఈ షో లో పాల్గొనేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

    ఇకపోతే అభినవ్ చూసేందుకు కామెడీ గా కనిపిస్తాడు కదా, ఆయన కామెడీ మాత్రమే చేస్తాడు, గొడవలు చెయ్యరు అని మీరు అనుకుంటే పొరపాటే. ట్విట్టర్ లో ఆయన ఎన్నోసార్లు తనపై వ్యంగ్యంగా మాట్లాడే నెటిజెన్స్ పై చాలా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. అప్పుడప్పుడు ఘాటుగా బూతులు కూడా మాట్లాడేవాడు. కాబట్టి ఈయన అన్నీ విధాలుగా బిగ్ బాస్ షో కి సరిపోతాడు, ప్రీ ఫ్యాన్ బేస్ కూడా బలంగా ఉంది కాబట్టి, టైటిల్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇకపోతే ఈ సీజన్ సెప్టెంబర్ 1 వ తేదీ నుండి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. త్వరలోనే తేదీని అధికారికంగా ప్రకటించబోతున్నారు.