https://oktelugu.com/

కేసీఆర్ కు విధేయత చూపిస్తున్న టాలీవుడ్..!

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ సినిమా ఇండస్ట్రీకి పెద్దగా చేసిందేమీ లేదని అభిప్రాయం సినీప్రియుల్లో ఉంది. దీంతోనే టాలీవుడ్లోని కొందరు ప్రముఖులు టాలీవుడ్ ను ఆంధ్రాకు తరలించాలని యత్నించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే టాలీవుడ్ కు కేరాఫ్ గా హైదరాబాద్ మారడంతోనే ఇక్కడే ఉంటూ ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ వస్తున్నారు. Also Read: ఓటీటీనే సినిమా ఇండస్ట్రీని కాపాడుతోందా? టీఆర్ఎస్ సర్కార్ గత ఆరేళ్లలో సినిమా ఇండస్ట్రీ అభివృద్ధికి చేసేంది తక్కువేనని […]

Written By:
  • NARESH
  • , Updated On : November 25, 2020 5:46 pm
    Follow us on

    Telugu Film Indutry

    తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ సినిమా ఇండస్ట్రీకి పెద్దగా చేసిందేమీ లేదని అభిప్రాయం సినీప్రియుల్లో ఉంది. దీంతోనే టాలీవుడ్లోని కొందరు ప్రముఖులు టాలీవుడ్ ను ఆంధ్రాకు తరలించాలని యత్నించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే టాలీవుడ్ కు కేరాఫ్ గా హైదరాబాద్ మారడంతోనే ఇక్కడే ఉంటూ ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ వస్తున్నారు.

    Also Read: ఓటీటీనే సినిమా ఇండస్ట్రీని కాపాడుతోందా?

    టీఆర్ఎస్ సర్కార్ గత ఆరేళ్లలో సినిమా ఇండస్ట్రీ అభివృద్ధికి చేసేంది తక్కువేనని టాక్ ఉంది. హైదరాబాద్లో ఫిల్మ్ సిటీ ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ గతంలోనే పలుసార్లు ప్రకటించిన నేటికీ కార్యరూపం దాల్చలేదు. తాజాగా నగరంలో ఎన్నికలు రావడంతో మరోసారి ఫిల్మ్ సిటీ అంశం తెరపైకి వచ్చింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత రెండోసారి జీహెచ్ఎంసీ ఎన్నికలు తాజాగా జరుగబోతున్నాయి. ఈ నేపథ్యంలో టాలీవుడ్ పై సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు.

    జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో సీఎం కేసీఆర్ చిన్న సినిమాలకు జీఎస్టీ మినహాయింపు.. కనీస విద్యుత్ డిమాండ్ ఛార్జీల రద్దు.. థియేటర్లలో టికెట్ల రేట్ల పెంపు.. షోలు పెంచుకునే వెలుసుబాటు లాంటి హామీలను గుప్పించారు. దీనిపై ఇండస్ట్రీలోని పెద్దలైన మెగాస్టార్ చిరంజీవి.. కింగ్ నాగార్జున.. విక్టరీ వెంకటేష్ లు సోషల్ మీడియాలో స్పందిస్తూ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు.

    Also Read: హీరోయిన్లు మాల్దీవులకు.. హీరోలు దుబాయ్ కి.. !

    అయితే ఇండస్ట్రీలోని ప్రతీఒక్కరు మేము ఎక్కడ వెనుకబడిపోతామో అన్నట్లు టీఆర్ఎస్ సర్కారుకు మద్దతుగా మెసేజులు పడుతుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత రెండుమూడ్రోజులుగా ఇండస్ట్రీలోని చిన్న పెద్ద నటీనటులతోపాటు టెక్నిషిన్లు అదేపనిగా ప్రభుత్వానికి మద్దతు ప్రకటిస్తుండటం సినీప్రియులకు రుచించడం లేదు. అధికారంలో ఉండే పార్టీకే సినిమావాళ్లు మద్దతు ఇస్తారని అందరికీ తెల్సిందే అయినప్పటికీ మరీ ఇంతలా సాగిపడటాన్ని మాత్రం పలువురు తప్పుబడుతున్నారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్