https://oktelugu.com/

కేసీఆర్ వరాలపై మహేష్.. రాజమౌళి ఏమన్నారంటే?

తెలంగాణలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరుగున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ టాలీవుడ్ ఇండస్ట్రీపై వరాల జల్లు కురిపించిన సంగతి తెల్సిందే. టాలీవుడ్ కు హైదరాబాద్ కు కేరాఫ్ గా మారడంతో ఈ ప్రాంతంలో ఎక్కువగా సినిమావాళ్లే స్థిరపడిపోయారు. పెద్దపెద్ద స్టార్ల నుంచి చిన్న నటీనటులు.. సాంకేతిక నిపుణుల వారందరూ కూడా హైదరాబాద్లోనే నివాసం ఉంటున్నారు. దీంతో వారిని ఆకట్టుకునేలా తెలంగాణ సర్కార్ ఎన్నికల వరాలను ప్రకటించింది. Also Read: కేసీఆర్ కు విధేయత చూపిస్తున్న టాలీవుడ్..! సీఎం కేసీఆర్ […]

Written By:
  • NARESH
  • , Updated On : November 25, 2020 5:51 pm
    Follow us on

    Mahesh Babu Rajamouli

    తెలంగాణలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరుగున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ టాలీవుడ్ ఇండస్ట్రీపై వరాల జల్లు కురిపించిన సంగతి తెల్సిందే. టాలీవుడ్ కు హైదరాబాద్ కు కేరాఫ్ గా మారడంతో ఈ ప్రాంతంలో ఎక్కువగా సినిమావాళ్లే స్థిరపడిపోయారు. పెద్దపెద్ద స్టార్ల నుంచి చిన్న నటీనటులు.. సాంకేతిక నిపుణుల వారందరూ కూడా హైదరాబాద్లోనే నివాసం ఉంటున్నారు. దీంతో వారిని ఆకట్టుకునేలా తెలంగాణ సర్కార్ ఎన్నికల వరాలను ప్రకటించింది.

    Also Read: కేసీఆర్ కు విధేయత చూపిస్తున్న టాలీవుడ్..!

    సీఎం కేసీఆర్ సినీ కార్మికులను ఆదుకునేందుకు వరాలు ప్రకటించడాన్ని టాలీవుడ్ పెద్దలు స్వాగతిస్తున్నారు. 40వేల మంది సినీ కార్మికులకు రేషన్.. హెల్త్ కార్డులు ఇస్తామని ప్రకటించడం.. చిన్న సినిమాలకు జీఎస్టీ మినహాయింపు.. టిక్కెట్ రేటు పెంచుకునే వెసులుబాటు .. షోలు పెంచుకునే వెసులుబాటును ఎగ్జిబిటర్లకు కల్పిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. సీఎం ప్రకటించిన హామీలన్నీ కూడా సినిమావాళ్లకు మేలు చేసేలా ఉండటంతో ఇండస్ట్రీలోని ప్రతీఒక్కరు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

    సీఎం వరాలపై టాలీవుడ్లోని టాలీవుడ్లోని పెద్దలు మెగాస్టార్ చిరంజీవి.. కింగ్ నాగార్జున.. వెంకటేష్ లు ప్రభుత్వానికి నిన్ననే కృతజ్ఞతలు తెలిపారు. తాజాగా సీఎం కేసీఆర్ వరాలపై సూపర్ స్టార్ మహేష్ బాబు.. దర్శక దిగ్గజం రాజమౌళి స్పందించారు. మహేష్ బాబు తన ట్వీటర్లో స్పందిస్తూ ‘టీఎఫ్ఐకి భారీ ఎత్తు’ అని పోస్ట్ చేశారు. ఇండస్ట్రీలోని లక్షలాది మంది జీవితాలను నిలబెట్టడం అనే సంప్రదాయాన్ని సజీవంగా ఉంచడానికి ప్రభుత్వం ప్రకటించిన అన్ని సహాయక చర్యలకు ధన్యవాదాలంటూ ట్వీట్ చేశారు.

    Also Read: ఓటీటీనే సినిమా ఇండస్ట్రీని కాపాడుతోందా?

    దర్శక దిగ్గజం రాజమౌళి సైతం కేసీఆర్ వరాలపై స్పందించారు. ‘సీఎం కెసిఆర్ గారు ప్రకటించిన చాలా అవసరమైన సహాయక చర్యలతో తెలుగు చిత్ర పరిశ్రమ ఆనందిస్తోంది.. వీటివల్ల టాలీవుడ్ మళ్లీ పురోగతి మార్గంలో పయనించే ఛాన్సుంటుంది. కరోనా క్రైసిస్ నుంచి టాలీవుడ్ కోలుకునేందుకు వరాలు ప్రకటించిన మీకు ధన్యవాదాలు సార్..@ తెలంగాణ సిఎంఓ’ అంటూ రాజమౌళి ట్వీట్ చేశారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్