కరోనా క్రైసిస్ తో సినిమా ఇండస్ట్రీ కుదేలైంది. థియేటర్లు మూతపడగా.. షూటింగులు వాయిదా పడ్డాయి. దీంతో ఈరంగంపై ఆధారపడి జీవిస్తున్న లక్షలమంది కార్మికులు వీధిన పడ్డారు. ఈ సమయంలోనూ సినిమా ఇండస్ట్రీని.. ముఖ్యంగా నిర్మాతలను ఓటీటీలే కాపాడాయనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.కరోనాతో థియేటర్లు మూతపడగా డిస్ట్రిబ్యూషన్ రంగం దెబ్బతింది. టాకీసులు మూతపడటంతో సినిమాలను రిలీజు చేసుకోలేక నిర్మాతలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. నిర్మాతలు తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగిపోవడంతో గత్యంతరంలేక సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేయాల్సి […]
కరోనా క్రైసిస్ తో సినిమా ఇండస్ట్రీ కుదేలైంది. థియేటర్లు మూతపడగా.. షూటింగులు వాయిదా పడ్డాయి. దీంతో ఈరంగంపై ఆధారపడి జీవిస్తున్న లక్షలమంది కార్మికులు వీధిన పడ్డారు. ఈ సమయంలోనూ సినిమా ఇండస్ట్రీని.. ముఖ్యంగా నిర్మాతలను ఓటీటీలే కాపాడాయనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.కరోనాతో థియేటర్లు మూతపడగా డిస్ట్రిబ్యూషన్ రంగం దెబ్బతింది. టాకీసులు మూతపడటంతో సినిమాలను రిలీజు చేసుకోలేక నిర్మాతలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. నిర్మాతలు తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగిపోవడంతో గత్యంతరంలేక సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేయాల్సి వచ్చింది. ఈ నిర్ణయమే నిర్మాతలు నష్టపోకుండా వారిని కాపాడింది.
ఇటీవల ఓటీటీ రిలీజైన సినిమాలను పరిశీలిస్తే దాదాపు 99శాతం సినిమాలు ప్లాప్ టాక్ తెచ్చుకున్నాయి. ఈ సినిమాలన్నీ కూడా ఒకవేళ థియేటర్లలో రిలీజైతే మాత్రం నిర్మాతలు.. బయ్యర్లు తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చేదనే టాక్ విన్పిస్తోంది. కరోనా వల్ల సినిమా ఇండస్ట్రీ కుదేలైనప్పటికీ ఓటీటీలో సినిమాలను రిలీజ్ చేసిన నిర్మాతలను మాత్రం కాపాడినట్లు కన్పిస్తోంది.
ఓటీటీలో సినిమాలను విడుదల చేసిన నిర్మాతలు సేఫ్ గా బయటపడ్డారనే టాక్ విన్పిస్తోంది. ఓటీటీలో సినిమా హిట్టయినా.. ఫ్లాప్ అయినా పెద్దగా బయటికి తెలియకపోవడం కలిసొచ్చే అంశం. సినిమా టాక్ తో సంబంధం లేకుండా ఓటీటీ సబ్ స్ట్రైబర్లు ఎలాగూ ఫ్రీ కాబట్టి చూస్తారు. ఈలోపు సోషల్ మీడియాలో సినిమాను ఓ రేంజ్లో ప్రచారం చేసేస్తారు.
ఓటీటీల మూలంగా మూలనపడ్డ దర్శకులు కూడా మళ్లీ సినిమాలు తీయడానికి రెడీ అవుతుండటం విశేషం. ఏదిఏమైనా కరోనా క్రైసిస్ నుంచి నిర్మాతలను ఓటీటీలు గట్టెక్కించినట్లే కన్పిస్తోంది. ఇక థియేటర్లు కూడా పూర్తి స్థాయిలో ఓపెన్ అయి ప్రేక్షకులు టాకీసుల్లో సినిమాల్లో చూస్తే చిత్రసీమకు మళ్లీ పుర్వవైభవం రావడం ఖాయమనే టాక్ విన్పిస్తోంది.