Mohan Babu: తెలుగు సినిమా ఇండస్ట్రీ గత కొన్ని రోజులుగా మీడియా లో హాట్ టాపిక్ గా మారుతుంది. కొన్ని గంటల క్రితమే మెగా స్టార్ చిరంజీవి ఇండస్ట్రి పెద్దగా ఉండడం తనకి ఇష్టం లేదంటూ తేల్చి చెప్పిన తరుణంలో మోహన్ బాబు తాజాగా చేసిన వ్యాఖ్యలు ట్రెండింగ్ గా మారాయి. ఆజాది కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి 125వ జయంతి ఉత్సవాలు హైదరాబాద్ ఫిలింనగర్ లోని కల్చరల్ క్లబ్ లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఏపీ పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్, తెలంగాణ పర్యాటక మంత్రి శ్రీనివాస్ గౌడ్, కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్ రెడ్డి ప్రముఖ నటులు సూపర్ స్టార్ కృష్ణ, మోహన్ బాబులు పాల్గొన్నారు. ఈసందర్భంగా అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని నేతలు ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ… రెండు సార్లు ఎమ్మెల్యే గా పని చేసిన అవంతి శ్రీనివాస్ అల్లూరి ఊరికి ఏమి చేశారో చెప్పాలి అని నవ్వుతూ అన్నారు. అల్లూరు ఊరికి నేను వచ్చి చూస్తాను. అవంతి శ్రీనివాస్ ఏమి చేశాడో చూస్తాను ? సహాయం కావాలంటే చేసే వ్యక్తి కిషన్ రెడ్డి. కరోనా టైములో మా ఫ్యామిలీ మెంబెర్స్ సింగపూర్ లో ఉండి పోతే ఆయన సహాయం చేశారు. సౌత్ ఇండియా అంటే ఏంటి ? నార్త్ ఇండియా అంటే ఏంటి? ఇంతకు ముందు పరిస్థితులు వేరు… ఇప్పటి ప్రధాని అన్ని చేస్తారు. మధ్యలో కలగజేసుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి… మంత్రి అవంతిని వదిలేయమంటూ అడిగారు. దీంతో కిషన్ రెడ్డి చెప్పాడు కాబట్టి వదిలేస్తున్నానని మోహన్ బాబు అనడంతో వేదికపైన ఉన్నవారు సరదాగా నవ్వుకున్నారు. తాను రూ.300 జీతానికి అల్లూరి సీతారామరాజు సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశానని మోహన్ బాబు గుర్తు చేసుకున్నారు. పార్లమెంట్ లో అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఏర్పాటు చేసేలా కిషన్ రెడ్డి కృషి చేయాలని కోరారు.

గతంలో లాగా సినిమాలు వంద రోజులు ఆడటం లేదని.. ఇప్పటి సినిమాలు ఒకటి రెండు రోజులు మాత్రమే ఆడుతున్నాయని మోహన్ బాబు చెప్పారు. అనంతరం సూపర్ స్టార్ కృష్ణ మాట్లాడుతూ తన వందవ చిత్రంగా అల్లూరి సీతారామరాజు చిత్రాన్ని, తానే స్వయంగా నటించి నిర్మించినట్లు కృష్ణ తెలిపారు. తన జీవితంలోనే అత్యుత్తమ చిత్రం అల్లూరి సీతారామరాజు అంటూ కృష్ణ భావోద్వేగానికి గురయ్యారు.