Polavaram Project: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఏళ్లుగా సాగుతూనే ఉంది. దీనిపై ప్రభుత్వాలు మారినా దాని నిర్మాణ దశలు మాత్రం మారడం లేదు. ఇందులో భాగంగా రూ. 47,725 కోట్లతో సవరించిన అంచనాల పెట్టుబడికి అనుమతి ఇప్పట్లో లభించేలా లేదు. దీంతో ప్రాజెక్టు అథారిటీ కేంద్ర జలశక్తి శాఖకు పంపిన అంచనా వ్యయంపై మళ్లీ మెలిక పెట్టింది. దీంతో ఇది తేలేందుకు మరికొన్ని నాళ్లు పట్టే అవకాశాలున్నాయి. దీంతో పోలవరం ప్రాజెక్టు కల ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు.

పోలవరం నిర్వాసితుల్లో ఎన్ని నిర్వాసిత కుటుంబాలు ఉన్నాయో కచ్చితమైన సమాచారం ఇవ్వాలని అథారిటీ కోరింది. సర్వే సరిగా లేదని అభిప్రాయపడింది. నిర్వాసిత కుటుంబాల జాబితా పూర్తి స్థాయిలో లేకపోవడంతో ఇన్నాళ్లు ఆలస్యం అయిందని తెలుస్తోంది. అందుకే అధికారులు నిక్కచ్చిగా జాబితా తయారు చేసి వారికి ఏ నష్టం జరగకుండా చూడాల్సిందేనని తేల్చింది.
Also Read: రెమ్యూనరేషన్ గురించి క్లారిటి ఇచ్చిన మాస్ మహరాజ్… ఏమన్నాడంటే ?
కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ పనులు చేయొద్దని వారించినా పట్టించుకోవడం లేదు. ఫలితంగా పనులు నిలిపివేయాలని ఇచ్చిన ఉత్తర్వులను ఖాతరు చేయడం లేదు. దీంతో కేంద్రం ఈ విషయంలో కూడా అనుమతులు ఇవ్వకుండా నిరాకరిస్తోంది. ప్రాజెక్టు పనుల్లో తాత్సారం జరుగుతోంది. ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యగా ప్రాజెక్టు అలాగే ఉంటోంది.
ప్రాజెక్టు నిర్మాణానికి సానుకూల పరిస్థితులు లేకపోవడంతోనే కొర్రీలు పడుతున్నాయి. అయినా రాష్ర్ట ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. ఫలితంగా కేంద్రం నుంచి రావాల్సిన బిల్లులు కూడా ఆలస్యం అవుతున్నాయి. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్లు పోలవరం ప్రాజెక్టు కు అనేక అడ్డంకులు ఏర్పడుతున్నాయి. దీంతో ప్రాజెక్టు పనులు త్వరితగతిన సాగడం లేదు. ఇంకా ఎన్నటికి ప్రాజెక్టు పూర్తవుతుందో వేచి చూడాల్సిందే.
Also Read: సీనియర్ హీరోయిన్ ప్రేమలో కాంగ్రెస్ నేత కుమారుడు !