https://oktelugu.com/

Sankranti 2022 Movies: సంక్రాంతి రేసులో దూకేస్తున్న సినిమాలు ఇవే !

Movies released for Sankranthi festival:‘ఆర్‌ఆర్‌ఆర్’ ఎప్పుడైతే రేసులో నుంచి వాయిదా రూపంలో పోస్ట్ ఫోన్ అయిందో.. ఇక మిగిలిన సినిమాల‌న్నీ సంక్రాంతి రేసులో గేట్లు ఎత్తేసి బయటకు దూకేస్తున్నాయి. ఈ సడెన్ పోటీలో ఏ సినిమా ఎప్పుడు వస్తోందో కూడా అర్ధం కావడం లేదు. ఇప్పుడు ఉన్న సమాచారం ప్రకారం.. జ‌న‌వ‌రి 14న డీజే టిల్లు రిలీజ్ కాబోతుంది. ఇక 15న ‘హీరో’ అనే సినిమా రేసులోకి వచ్చింది. అలాగే మ‌రో మూడు సినిమాలు సైతం […]

Written By:
  • Shiva
  • , Updated On : January 2, 2022 / 05:15 PM IST
    Follow us on

    Movies released for Sankranthi festival:‘ఆర్‌ఆర్‌ఆర్’ ఎప్పుడైతే రేసులో నుంచి వాయిదా రూపంలో పోస్ట్ ఫోన్ అయిందో.. ఇక మిగిలిన సినిమాల‌న్నీ సంక్రాంతి రేసులో గేట్లు ఎత్తేసి బయటకు దూకేస్తున్నాయి. ఈ సడెన్ పోటీలో ఏ సినిమా ఎప్పుడు వస్తోందో కూడా అర్ధం కావడం లేదు. ఇప్పుడు ఉన్న సమాచారం ప్రకారం.. జ‌న‌వ‌రి 14న డీజే టిల్లు రిలీజ్ కాబోతుంది. ఇక 15న ‘హీరో’ అనే సినిమా రేసులోకి వచ్చింది.

    Movies Released

    అలాగే మ‌రో మూడు సినిమాలు సైతం రిలీజ్ కి రెడీ అయ్యాయి. మెగా అల్లుడు క‌ల్యాణ్ దేవ్ ‘సూప‌ర్ మ‌చ్చీ’ సినిమాని కూడా జ‌న‌వ‌రి 14నే రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక ఎం.ఎస్ రాజు ద‌ర్శ‌క‌త్వంలో వస్తోన్న బూతు సినిమా ‘7 డేస్‌.. 6 నైట్స్‌’ను కూడా సంక్రాంతి రేసులో వదులుతున్నాం అని నిర్మాతలు ఇప్పటికే ప్ర‌క‌టించారు.

    Also Read: అల్లూరి పుట్టిన ఊరికి నువ్వేం చేశావంటూ… ఏపీ మంత్రికి సెటైర్లు వేసిన మోహన్ బాబు ?

    దిల్ రాజు బ్యాన‌ర్‌లో వస్తోన్న ‘రౌడీ బోయ్స్‌’ని కూడా ఇప్పుడు సంక్రాంతికే దింపేయాలని డిసైడ్ అయ్యారు. అలాగే, హీరో రానా న‌టించిన ద్విభాషా సినిమా ‘1945’ను కూడా జ‌న‌వ‌రి 7న తీసుకురాబోతున్నారు. ఇక వీటితో పాటు అక్కినేని నాగార్జున ‘బంగార్రాజు’ సినిమా కూడా ప్రధానంగా ఈ సంక్రాంతినే టార్గెట్ చేసుకుని రాబోతుంది.

    ‘బంగార్రాజు’ సినిమా విడుద‌ల తేదీ ఇంకా అధికారికంగా ప్ర‌క‌టించ‌కపోయినా.. సంక్రాంతికి వస్తున్నాం అంటూ క్లారిటీ ఇచ్చారు. నిజానికి పైన చెప్పుకున్న సినిమాల‌న్నీ ఎప్పుడో రెడీ అయిపోయి.. ఫస్ట్ కాపీతో రిలీజ్ డేట్ కోసం చాలా కాలంగా ఆశగా ఎదురుచూస్తూ ఉన్నాయి. ఒక విధంగా పై సినిమాలన్నీ 2021లోనే రిలీజ్ కావాలి. కానీ డేట్లు కుద‌ర్లేదు. మొత్తమ్మీద సంక్రాంతికి రాబోతున్నాయి.

    Also Read:  హిందీలో కలెక్షన్లతో దుమ్ము రేపుతున్న అల్లు అర్జున్ “పుష్ప”… ఎంతంటే ?

    Tags