మరోపక్క విడుదల తేదీలను పదే పదే మార్చలేక అసలు సినిమా రిలీజ్ డేట్స్ నే ప్రకటించడం మానేశారు. ఉదాహరణకు జక్కన్న రాజమౌళి “ఆర్ఆర్ఆర్”(RRR) విషయానికే వద్దాం. రిలీజ్ డేట్ ని అనేకసార్లు మార్చేశారు. పోనీ ఇన్నిసార్లు మార్చారు కాబట్టి, ఫైనల్ గా ఓ డేట్ కి ఫిక్స్ అయ్యారా అంటే అదీ లేదు.
ఇప్పటికీ ఆర్ఆర్ఆర్ సినిమా దసరాకి రాదా ? లేక, వస్తోందా ? అని కూడా మేకర్స్ క్లారిటీగా చెప్పలేకపోతున్నారు. ప్రస్తుతం ఉన్న టాక్ ప్రకారం.. వచ్చే ఉగాదికి ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. అది కూడా కరోనా మహమ్మారి లేకపోతే..! పాన్ ఇండియా సినిమాకే ఇలాంటి పరిస్థితి ఉంటే, ఇక మామూలు సినిమా పరిస్థితి ఏమిటి ?
అందుకే, మిగిలిన సినిమాల మేకర్స్ కాస్త తెలివిగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా గోపీచంద్ హీరోగా వస్తోన్న “సీటిమార్”(Seetimaarr) నిర్మాతలు నుండి ఒక పోస్టర్ వచ్చింది. ఆ పోస్టర్ లో వాళ్ళు చెప్పిన ప్రధాన అంశం.. సిటీ మార్ సినిమా సెప్టెంబర్ లో విడుదల అవుతుందని. కానీ ఏ రోజు రిలీజ్ అవుతుంది ? పక్కాగా డేట్ చెప్పలేదు మేకర్స్.
అలాగే నాగ చైతన్య, సాయి పల్లవి “లవ్ స్టోరీ”(Love Story)ని సెప్టెంబర్ 10న రిలీజ్ అవుతుందని ప్రకటించారు. కానీ, ఇప్పుడు ఈ సినిమా డేట్ కూడా మారనుంది. పైగా ఈ సారి డేట్ ను ప్రకటించకుండా కేవలం, ఫలానా నెలలో రిలీజ్ అవ్వనుంది అంటూ ఒక పోస్టర్ రిలీజ్ చేస్తారట. మొత్తానికి విడుదల తేదీ ప్రకటించకపోవడం తెలివైన నిర్ణయం అయిపోయింది.