Homeఎంటర్టైన్మెంట్Anchor Sreemukhi fails : శ్రీముఖిని చూసేందుకు జనాలు రావట్లేదు !

Anchor Sreemukhi fails : శ్రీముఖిని చూసేందుకు జనాలు రావట్లేదు !

Crazy Uncles CollectionsAnchor Sreemukhi fails: యాంకర్ శ్రీముఖికి(Sreemukhi) సోషల్ మీడియాలో ముఖ్యంగా యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. పైగా బుల్లితెర పై శ్రీముఖి తిరుగులేని స్టార్. టీవీ షోలలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న వారి లిస్ట్ లో ‘శ్రీముఖి’ కూడా ఒకరు. అన్నిటికీ మించి ఆమెలోని ముద్దు తనం, బొద్దు తనం జనానికి బాగా ఇష్టం. కానీ అన్నీ ఉన్నా హీరోయిన్ గా మాత్రం నిలబడలేకపోయింది.

మొదటి నుండి కెరీర్ ను కరెక్ట్ గా ప్లాన్ చేసుకోలేదు. తాజాగా శ్రీముఖి ప్రధాన పాత్రలో విడుదలైన సినిమా ‘క్రేజీ అంకుల్స్’(Crazy Uncles). సినిమాలో శ్రీముఖి గ్లామర్ డోస్ బాగానే ఉంది. కానీ, శ్రీముఖిని చూసేందుకు జనాలు థియేటర్లకు రాలేదు. మరి శ్రీముఖికి ఉన్న క్రేజ్ అంతా టీవీ కే పరిమితమా ?,

అయితే, ఇక్కడ ఇంకో సమస్య ఉంది. శ్రీముఖి ఎంచుకునే కథలు. అలాగే ఆమె పనిచేసే చిత్రాలు కూడా మరీ అద్వానంగా ఉంటాయి. విషయం లేని దర్శకులతో సినిమాలు చేస్తే ఏమిటి లాభం ? మొత్తమ్మీద శ్రీముఖికి స్క్రిప్ట్ విషయంలో అసలు జడ్జిమెంట్ లేదు. ఇప్పటి వరకు ఆమె నటించిన సినిమాలు చూస్తేనే ఆమె ఐడియాలజీ ఏమిటో అర్థమవుతుంది.

ఒకపక్క తోటి యాంకర్స్ అనసూయ, రష్మీ గౌతమ్ లాంటి వారు కూడా కొన్ని విషయాలు అందుకుంటుంటే.. వారి కంటే అందంలో ఫాలోయింగ్ లో ఏ మాత్రం తీసిపోని శ్రీముఖి మాత్రం సింగిల్ హిట్ కోసం గత ఐదేళ్ల నుండి బాక్సాఫీస్ వద్ద యుద్ధం చేస్తూనే ఉంది. మరి ఈ 28 ఏళ్ల బ్యూటీ హీరోయిన్ గా ఇక ఎప్పుడు సక్సెస్ అవుతుందో ?

ఆమె గురించి తెలిసిన వాళ్ళు చెబుతున్న మాట ప్రకారం శ్రీముఖిలో హీరోయిన్ గా రాణించే స్కిల్ లేదట. ‘జులాయి’లో సిస్టర్ పాత్రతో వెండితెరపైకి అరంగేట్రం చేసిన శ్రీముఖి.. ఇప్పటికీ చిన్న పాటి నటిగానే మిగిలిపోవడం బాధాకరమైన విషయమే.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Exit mobile version