Tollywood Stars
Tollywood Producer : డబ్బుకు లోకం దాసోహం అంటారు పెద్దలు. అది అక్షర సత్యం. డబ్బున్న చోటే మనుషులు ఉంటారు. ఐశ్వర్యవంతుడి ఇల్లు ఎప్పుడూ చుట్టాలు పక్కాలు, అతిథులతో కలకాలాడుతూ ఉంటుంది. గత ఏడాది ముఖేష్ అంబానీ తన కొడుకు అనంత్ అంబానీ వివాహం వేల కోట్లు ఖర్చు పెట్టి చేశాడు. బాలీవుడ్ స్టార్స్ అందరూ ఆ పెళ్లి వేడుకలకు హాజరయ్యారు. ఎన్ని రోజులు వేడుకలు ఉంటే అన్ని రోజులు వెళ్లారు. టాలీవుడ్ నుండి కూడా ఒకరిద్దరు స్టార్స్ పాల్గొన్నారు.
అనంత్ అంబానీ పెళ్లి వేడుకలు డాన్సులు చేశారు. బాలీవుడ్ లో ఈ కల్చర్ చాలా కాలంగా ఉంది. వ్యాపారస్తుల పెళ్లి వేడుకల్లో డాన్సులు చేసి డబ్బులు తీసుకునే హీరోయిన్స్ ఉన్నారు. సల్మాన్, షారుఖ్ ఖాన్ వంటి స్టార్స్ కూడా హాజరైనందుకు కోట్లలో ఛార్జ్ చేస్తారనే వాదన ఉంది. మరి ఈ కల్చర్ టాలీవుడ్ కి కూడా పాకిందా? లేక స్టేటస్ కోసం బడా వ్యాపారస్తుల పెళ్లిళ్లకు పని గట్టుకుని మరీ టాలీవుడ్ స్టార్స్ వెళుతున్నారా? అనే సందేహం కలుగుతుంది.
ఇటీవల దుబాయ్ వేదికగా ఒక పెద్ద వ్యాపారవేత్త పెళ్లి వేడుక జరిగింది. ఈ వేడుకకు రామ్ చరణ్, ఎన్టీఆర్ సతీసమేతంగా హాజరయ్యారు. అఖిల్ అక్కినేని, నాగార్జున, నాగ చైతన్య పాల్గొన్నారు. అలాగే నమ్రత శిరోద్కర్, సితార ఆ పెళ్ళిలో సందడి చేశారు. ఈ పెళ్లి వేడుకల్లో ఈ టాలీవుడ్ సెలెబ్స్ డాన్సులు చేశారు. ఆహ్లాదంగా గడిపారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఈ క్రమంలో ఒక బడా నిర్మాత సదరు టాలీవుడ్ సెలెబ్స్ పై తీవ్ర అసహనం వ్యక్తం చేశాడట. ఈ హీరోలతో సినిమాలు చేసే నిర్మాతల ఇంట్లో వేడుకలకు రమ్మంటే అనేక సాకులు చెబుతారు. తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. అదే బడా వ్యాపారస్తుల కోసం విదేశాలకు కూడా వెళతారని ఆయన అన్నారట. ఈ మేరకు ఓ న్యూస్ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. ఆ నిర్మాత ఎవరు అనేది తెలియదు.