https://oktelugu.com/

V Hanumantha Rao: బద్ద వ్యతిరేకులు భేటీ అయ్యారు.. ఊరికనే కలువరు ఈ మహానుభావులు.. అరుదైన దృశ్యం ఇది!

ఊరికనే రారు మహానుభావులు.. అని ఓ సామెత ఉంది. అయితే ఇప్పుడు దీన్ని ఊరికనే కలవరు మహానుభావులు అని మార్చుకోవాలేమో.. ఎందుకంటే కలిసిన రాజకీయ నాయకులు అలాంటివారు మరి. ఇంతకీ వారు ఎవరు? ఏమిటి ఆ కథ.. ఈ కథనంలో తెలుసుకుందాం.

Written By: , Updated On : February 25, 2025 / 12:23 PM IST
V Hanumantha Rao

V Hanumantha Rao

Follow us on

V Hanumantha Rao: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కొనసాగుతున్నారు. 2014 నుంచి 2019 వరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని ఆయన పరిపాలించారు. 2019లో జరిగిన ఎన్నికల్లో ఘోర ఓటమి ఎదుర్కొన్నారు. వైసీపీ ప్రభంజనం ముందు 23 సీట్లకే పరిమితమయ్యారు. అయితే ఈసారి జనసేన, బిజెపితో పొత్తు పెట్టుకుని కూటమిగా ఏర్పడి వైసిపి మీద పోటీ చేశారు. 2019 నాటి ఓటమికి బదులు తీర్చుకున్నారు. వై నాట్ 175 అని గట్టిగా నినదించిన జగన్మోహన్ రెడ్డిని 11 సీట్లకే పరిమితం చేశారు.. ఇక జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాలంలో చోటు చేసుకున్న అవకతవకలపై దృష్టి సారించారు చంద్రబాబు. అయితే ఇదే సమయంలో ఎన్నికలకు ముందు ఆయన చేసిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేయలేకపోవడంతో ప్రజల్లో ఆగ్రహం వ్యక్తం అవుతుంది. ఏపీలో అధికారంతోపాటు.. భారీగా పార్లమెంటు స్థానాలను గెలుచుకున్న నేపథ్యంలో.. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారు చంద్రబాబు. అందువల్లే ఏపీ రాష్ట్రానికి బడ్జెట్లలో ప్రత్యేకంగా నిధులు తీసుకొస్తున్నారు.. ఆసియా డెవలప్మెంట్ బ్యాక్.. ప్రపంచ బ్యాంకు.. అమరావతి నిర్మాణానికి 15,000 కోట్ల నిధులు మంజూరు చేశాయి. దీంతో చంద్రబాబుపై కాస్త జనాలలో పాజిటివ్ కోణం ఉన్నప్పటికీ.. సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయకపోవడంతో తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం అవుతుంది.

చంద్రబాబును కలిసిన విహెచ్

ఇక తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకుడిగా వి హనుమంతరావు ఉన్నారు. ఈయన బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత. గతంలో చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హనుమంతరావు కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉండేవారు. బషీర్బాగ్ లో కాల్పులు.. విద్యుత్ బిల్లుల పెంపు.. రైతులకు మద్దతు ధర లభించకపోవడం వంటి ఉద్యమాలలో వి హనుమంతరావు కీలకపాత్ర పోషించారు.. నాడు చంద్రబాబు ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో విమర్శలు చేసేవారు. వి హనుమంతరావు పూర్తి తెలంగాణ యాసలో మాట్లాడుతారు. అందువల్ల ఆయన మాటలకు మీడియా విపరీతమైన హైప్ ఇచ్చేది. ఇక హనుమంతరావు తో చంద్రబాబుతో ఉప్పు నిప్పులాగనే వ్యవహరించేవారు. అయితే ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోవడం.. చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రి కావడం.. రాజకీయంగా హనుమంతరావు ప్రాచుర్యం తగ్గిపోవడం వంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబును వి హనుమంతరావు కలిశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఓ జిల్లాకు దివంగత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య పేరు పెట్టాలని.. ఆయన పేరు మీద స్మృతి వనం నిర్మించాలని హనుమంతరావు కోరారు. హనుమంతరావు విజ్ఞప్తికి చంద్రబాబు సానుకూలంగా స్పందించారు.. దళిత ముఖ్యమంత్రిగా దామోదరం సంజీవయ్యకు పేరు ఉందని.. అత్యంత నిజాయితీపరుడుగా ఆయన సేవలందించారని వి హనుమంతరావు ఈ సందర్భంగా పేర్కొన్నారు. మరి వి హనుమంతరావు విజ్ఞప్తిని చంద్రబాబు మన్నిస్తారా.. దానిని అమలులో పెడతారా అనేది వేచి చూడాల్సి ఉంది