OK Telugu Movie Time: మూవీ టైమ్ నుంచి ప్రజెంట్ టాలీవుడ్ అప్ డేట్స్ విషయానికి వస్తే.. కమల్ సొంత బ్యానర్లో కమలహాసన్ కథానాయకుడిగా ‘విక్రమ్’ సినిమా రూపొందింది. అయితే సూపర్ స్టార్స్ కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్‌ల మోస్ట్ అవైటెడ్ మూవీ విక్రమ్ ట్రైలర్ డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఈనెల 14న ట్రైలర్ లాంచ్ డేట్‌ను రివీల్ చేయనున్నారు. కాగా ఈ సినిమాలో కమల్ సీక్రెట్ ఏజెంట్ గా కనిపించనున్నారు. భారీ అంచనాలున్న ఈ మూవీని కమల్ హాసన్,మహేంద్రన్‌లు నిర్మిస్తున్నారు.

మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఏమిటంటే.. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ముచ్చటగా మూడు సినిమాలు విడుదలవుతున్నాయి. శర్వా నటించిన ఆడవాళ్లు మీకు జోహార్లు, కిరణ్ నటించిన సెబాస్టియన్, హాలీవుడ్ చిత్రం ది బ్యాట్‌మ్యాన్ సినిమాలు నేడు థియేటర్లలో సందడి చేయనున్నాయి. మూడు దేనికదే భిన్నం కాగా, ఫ్యామిలీ, వెరైటీ, యాక్షన్ సినీ ప్రియులకు వీకెండ్ వినోదాన్ని అందించనున్నాయి.
Also Read: ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది.. మూవీ అలా ఉంటుందట

ఇక మరో అప్ డేట్ ఏమిటంటే.. అల్లు అర్జున్ హీరోగా, రశ్మికా మందాన్న హీరోయిన్గా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘పుప్ప- ది రైజ్’ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ సినిమా పాటలే వినిపిస్తున్నాయి. తాజాగా ప్రముఖ గాయనీ ఉషా ఉతుప్ శ్రీవల్లి బెంగాలీ వెర్షన్‌ను పాడి ఆకట్టుకున్నారు.

కాగా ఈపాటను బెంగాలీ వెర్షన్ రాజీవ్ దత్తా రాశాను. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మొత్తానికి పుష్ప ఇంకా తన ప్రభావాన్ని చూపిస్తూనే ఉంది.
Also Read: ఆ స్టార్ హీరోయిన్ కి అర్జెంట్ గా వరుడు కావాలట !