Homeఎంటర్టైన్మెంట్Tollywood Trends: టుడే వైరల్ అవుతున్న క్రేజీ అప్ డేట్స్

Tollywood Trends: టుడే వైరల్ అవుతున్న క్రేజీ అప్ డేట్స్

Tollywood Trends : టాలీవుడ్ ట్రెండ్స్ నుంచి ప్రజెంట్ క్రేజీ అప్ డేట్స్ విషయానికి వస్తే.. కరోనా తగ్గుముఖం పట్టడంతో కొత్త సినిమాల విడుదలతో సినీ పరిశ్రమ మళ్లీ కళకళలాడుతోంది. నేడు తెలుగు రాష్ట్రాల్లో ముచ్చటగా మూడు సినిమాలు విడుదలవుతున్నాయి. శర్వా నటించిన ఆడవాళ్లు మీకు జోహార్లు, కిరణ్‌ నటించిన సెబాస్టియన్‌, హాలీవుడ్‌ చిత్రం ది బ్యాట్‌మ్యాన్‌ నేడు సందడి చేయనున్నాయి. మూడూ దేనికదే భిన్నం కాగా, ఫ్యామిలీ, వెరైటీ, యాక్షన్‌ సినీ ప్రియులకు వీకెండ్‌ వినోదాన్ని అందించనున్నాయి.

Tollywood Trends
Aadavallu Meeku Joharlu

ఇంకో అప్ డేట్ విషయానికి వస్టే.. భీమ్లా ఇప్పటికే చాలా చోట్ల బ్రేక్‌ ఈవెన్‌ కలెక్షన్లు సాధించి లాభాల బాట పట్టాడు. అయితే మరో వారంలో రానున్న రాధేశ్యామ్‌ కారణంగా వసూళ్లు తగ్గుతాయని కొందరు భావిస్తున్నారు. అయితే ఆ అడ్డంకి ఏమీ ఉండదని ట్రేడ్‌ వర్గాలు అంటున్నాయి. రాధేశ్యామ్‌ పూర్తిగా లవ్‌ స్టోరీ, భీమ్లాకి మాస్‌ ప్రేక్షకుల ఆదరణ ఎలాగో ఉంటుంది. ఇక ప్రస్తుతం భీమ్లా వసూళ్లు చూస్తుంటే రాధేశ్యామ్‌ వచ్చేలోపే అధిక వసూళ్లు రాబడుతుందంటున్నారు.

Also Read:  ఆడవాళ్లు మీకు జోహార్లు’ సెన్సార్ రిపోర్ట్ వ‌చ్చేసింది.. మూవీ అలా ఉంటుంద‌ట‌

Tollywood Trends
Radhe Shyam

మరో అప్ డేట్ ఏమిటంటే.. మంచు విష్ణు కార్యాలయంలో దొంగతనానికి పాల్పడ్డాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న హెయిర్ డ్రెస్సర్ నాగశ్రీనుకు మెగా బ్రదర్ నాగబాబు బాసటగా నిలిచారు. నాగశ్రీను కుటుంబ పరిస్థితిని తెలుసుకొని రూ. 50 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.

Tollywood Trends
Naga Srinu, naga babu

.కాగా నాగశ్రీనును, అతడి భార్య పిల్లలను తన కార్యాలయానికి పిలుపించుకొని మాట్లాడాడు. తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న అతడి కుటుంబానికి నాగబాబు తన వంతు ఆర్థికసాయం చేశారు.

Also Read: సాహో’ ఫలితం పై ప్రభాస్‌ కామెంట్స్‌ వైరల్‌

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular