Ghani: మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన ‘గని’ మూవీ సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ సినిమాకు U/A సర్టిఫికేట్ జారీ చేసింది. ఈ చిత్రం టోటల్ రన్ టైమ్ 2 గంటల 31 నిమిషాల 17 సెకన్లు ఉంది. దీనికి సంబంధించిన సెన్సార్ సర్టిఫికేట్‌ను మూవీ యూనిట్ అధికారికంగా విడుదల చేసింది. స్పోర్ట్స్ డ్రామాగా గని చిత్రం తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ మూవీలో వరుణ్‌కు జోడీగా సాయి మంజ్రేకర్ నటిస్తోంది.

ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్సయింది. ఫిబ్రవరి 25న థియేటర్లలో సినిమా రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించాడు. అయితే సినిమా అవుట్ ఫుట్ అంత గొప్పగా ఏమి లేదు అని తెలుస్తోంది. ఇక మ్యూజిక్ సెన్సేషన్ థమన్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.
Also Read: అశోకవనంలో విశ్వక్ సేన్ కొత్త సాంగ్ అదిరింది
అన్నట్టు ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ఉంది. ఆ సాంగ్ లో సిజ్లింగ్ బ్యూటీ తమన్నా హీరయిన్ గా నటిస్తుంది. పైగా ఈ స్పెషల్ సాంగ్ లో వరుణ్ తేజ్ తో కలిసి తమన్నా రొమాన్స్ చేసింది. మొత్తానికి తమన్నా ఈ సాంగ్ లో నటించడంతో గని సినిమా పై అంచనాలు పెరిగాయి. ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ బాక్సింగ్ కోట్ లో కండలు తిరిగిన దేహం కనిపించబోతున్నాడు.

అలాగే వరుణ్ తేజ్ ఈ సినిమా కోసం సిక్స్ ప్యాక్ బాడీనీ కూడా పెంచాడు. బాక్సర్ పాత్ర కాబట్టి.. ఈ పాత్ర కోసం వరుణ్‌తేజ్ కఠినమైన కసరత్తులు కూడా చేశాడు. వరుణ్ విదేశాలకు వెళ్లి మరీ బాక్సింగ్ కోచింగ్ తీసుకున్నాడు. పైగా కెరీర్ లో మొదటి సారి సిక్స్ ప్యాక్ లో షర్ట్ లేకుండా నటిస్తున్నాడు.
మరి గనితో వరుణ్ తేజ్ భారీ హిట్ కొడతాడేమో చూడాలి. ఇక ఈ సినిమాతో అల్లు అరవింద్ పెద్ద కుమారుడు అల్లు బాబీ మొదటిసారిగా నిర్మాతగా మారుతున్నాడు. సిద్దు అనే మరో నిర్మాతతో కలిసి బాబీ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. అందుకే ఈ సినిమా హిట్ బాబీకి కీలకం కానుంది.
Also Read: ప్రపంచంలో మొదటి సినిమా ఎప్పుడు ఎక్కడ ఎలా తీశారు ?
[…] Also Read: సంగీత ప్రపంచంలో డిస్కో గోల్డ్ మాన్ […]