https://oktelugu.com/

OKtelugu Movie Time: టాలీవుడ్ ప్రజెంట్ క్రేజీ మూవీ డేట్స్!

OKtelugu Movie Time: Jr NTR – మూవీ టైమ్ నుంచి ప్రజెంట్ టాలీవుడ్ అప్ డేట్స్ విషయానికి వస్తే.. క్లాసిక్ డైరెక్టర్ కొర‌టాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రంలో పొలిటికల్ టచ్ ఎక్కువగా ఉండబోతునున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ ఓ బ‌స్తీలో చ‌దువుకున్న స్టూడెంట్ లీడర్‌ పాత్రలో నటిస్తున్నాడట. రాజ‌కీయ నాయ‌కుల వ‌ల్ల విద్యార్థుల చ‌దువుకు ఆటంకం ఏర్ప‌డితే.. వారికి అండ‌గా ఎన్టీఆర్ ఎలా పోరాటం చేశాడ‌నేదే క‌థ అని తెలుస్తోంది. […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : January 30, 2022 / 04:31 PM IST
    Follow us on

    OKtelugu Movie Time: Jr NTR – మూవీ టైమ్ నుంచి ప్రజెంట్ టాలీవుడ్ అప్ డేట్స్ విషయానికి వస్తే.. క్లాసిక్ డైరెక్టర్ కొర‌టాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రంలో పొలిటికల్ టచ్ ఎక్కువగా ఉండబోతునున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ ఓ బ‌స్తీలో చ‌దువుకున్న స్టూడెంట్ లీడర్‌ పాత్రలో నటిస్తున్నాడట. రాజ‌కీయ నాయ‌కుల వ‌ల్ల విద్యార్థుల చ‌దువుకు ఆటంకం ఏర్ప‌డితే.. వారికి అండ‌గా ఎన్టీఆర్ ఎలా పోరాటం చేశాడ‌నేదే క‌థ అని తెలుస్తోంది. ఇదివ‌ర‌కు వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వచ్చిన జ‌న‌తా గ్యారేజ్ సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే.

    Jr NTR and Koratala Shiva

    Dil Raju – ఇక మరో అప్ డేట్ విషయానికి వస్తే.. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో పాన్ ఇండియా సినిమాలు విడుదల అవ్వాలని, చిత్ర పరిశ్రమ రేంజ్ మరింత పెరగాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. అందుకే ఆర్ఆర్ఆర్ వంటి పెద్ద సినిమాల కోసం తన సినిమాలు వాయిదా వేసుకునేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. చిత్ర పరిశ్రమ మేలు కోసం తాను ఏదైనా చేస్తానని ఉద్ఘాటించారు.

    Dil Raju

    Also Read: రవితేజ ‘ఖిలాడీ’లో అర్జున్ లుక్ అదిరింది !

    Hero Vishal – ఇక మరో అప్ డేట్ కి వస్తే.. హీరో విశాల్ లేటెస్ట్ మూవీ ‘సామాన్యుడు’. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాను విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మించగా.. కరోనా కారణంగా రిలీజ్ వాయిదా పడుతూ వస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో ఫిబ్రవరి 4న రిలీజ్ చేస్తామని నిర్మాతలు తాజాగా ప్రకటించారు.

    ఇప్పటివరకు విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచగా.. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందించాడు. అయితే, ఈ సినిమా ఎలాంటి అంచనాలు లేవు. పైగా ఈ సినిమా పై ఇప్పటికే నెగిటివ్ టాక్ కూడా వచ్చింది.

    Also Read: నా తమ్ముడు పవన్ అటువంటి వాడు కాదు.. ఎంపీగా పోటీచేయడంపై నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు…!

    Tags