https://oktelugu.com/

Ravi Teja Khiladi Movie: రవితేజ ‘ఖిలాడీ’లో అర్జున్ లుక్ అదిరింది !

Ravi Teja Khiladi Movie: మాస్ మహారాజ్ రవితేజ హీరోగా వస్తున్న ‘ఖిలాడీ’లో యాక్షన్ కింగ్ అర్జున్ లుక్ అదిరిపోయింది. రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఖిలాడీ రిలీజ్‌ కు రెడీగా ఉన్న ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ ఓ కీలక పాత్రలో నటించాడు. తాజాగా ఆయన పాత్రను పరిచయం చేస్తూ చిత్ర యూనిట్ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీ ఫిబ్రవరి 11న […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : January 30, 2022 / 04:17 PM IST
    Follow us on

    Ravi Teja Khiladi Movie: మాస్ మహారాజ్ రవితేజ హీరోగా వస్తున్న ‘ఖిలాడీ’లో యాక్షన్ కింగ్ అర్జున్ లుక్ అదిరిపోయింది. రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఖిలాడీ రిలీజ్‌ కు రెడీగా ఉన్న ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ ఓ కీలక పాత్రలో నటించాడు. తాజాగా ఆయన పాత్రను పరిచయం చేస్తూ చిత్ర యూనిట్ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీ ఫిబ్రవరి 11న విడుదల కానుంది.

    Ravi Teja Khiladi Movie

    కాగా గణతంత్రదినోత్సవం రోజున ‘‘ఫుల్‌ కిక్‌’’ అనే సాంగ్ తో దూసుకొచ్చిన రవితేజ సాంగ్ తో బాగా ఆకట్టుకున్నాడు. పైగా ఈ సాంగ్ లో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. సాంగ్ చాలా బాగుంది అంటూ నెటిజన్లు కూడా ఈ సాంగ్ ను ఫుల్ గా షేర్ అండ్ లైక్ చేశారు. దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఈ మాస్ సాంగ్ నిజంగానే ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్కు ఎక్కించింది.

    Also Read: నా తమ్ముడు పవన్ అటువంటి వాడు కాదు.. ఎంపీగా పోటీచేయడంపై నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు…!

    సినీప్రియులకు ఫుల్‌ కిక్‌ అందించిన ఈ పాటతో కలిపి ఇప్పటివరకు ఈ సినిమా నుంచి 4 సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. యాక్షన్‌ థ్రిల్లర్‌ గా వస్తున్న ఈ ‘ఖిలాడి’ సినిమాలో మీనాక్షి చౌదరి పాత్ర చాలా బలంగా ఉంటుందట. కాగా ఈ సినిమాలో నాజర్, పవిత్ర లోకేష్, తనికెళ్ల భరణి తదితరులు కీలక పాత్రలలో పోషిస్తున్నారు.

    Ravi Teja Khiladi Movie

    అలాగే ఈ సినిమాలో ఓ యంగ్ హీరో కూడా గెస్ట్ రోల్ లో కనిపిస్తున్నాడు అని టాక్ ఉంది. మొత్తానికి ఈ సినిమా పట్ల రవితేజ అభిమానులు ఇంట్రెస్ట్ చూపించేలా చేసుకోవడంలో టీమ్ బాగా సక్సెస్ అయింది. ఇప్పుడు అర్జున్ పోస్టర్ కూడా చాలా బాగుంది. సినిమా పై అంచనాలను పెంచింది.

    Also Read: మరో హీరోయిన్ కి కరోనా పాజిటివ్.. టెన్షన్ లో స్టార్ హీరో !

    Tags