Tollywood Heros : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు మంచి నటులుగా గుర్తింపును సంపాదించుకున్న చాలామంది ఇప్పుడు వాళ్ళను వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అహర్నిశలు ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇండియన్ సినిమా ఇండస్ట్రీని శాసిస్తున్న మన స్టార్ హీరోలు యావత్ ఇండియాలో వాళ్ళని మించిన నటులు మరొకరు లేరు అనేంత రేంజ్ లో సినిమాలను చేస్తూ వరుస సక్సెస్ లను సాధిస్తూ బాలీవుడ్ ప్రేక్షకులను సైతం తమ వైపు తిప్పుకుంటున్నారు…ఇక ఇదిలా ఉంటే వాళ్ల కెరియర్ స్టార్టింగ్ లో పలు సినిమాలు చేస్తున్న సందర్భంలో వాళ్ళు కొంతమంది హీరోయిన్లను ప్రేమించారు అంటు కొన్ని వార్తలైతే అప్పట్లో హల్చల్ చేశాయి. ఇంతకీ ఎవరు ఏ హీరోయిన్ ప్రేమించినట్టుగా వార్తలు వచ్చాయి అందులో ఎంతవరకు నిజం ఉంది అనే విషయాన్ని మనం ఒకసారి తెలుసుకుందాం…
మొదటగా జూనియర్ ఎన్టీఆర్(Jr NTR) విషయానికి వస్తే ఈయన కెరియర్ స్టార్టింగ్ లో సమీర రెడ్డి (Sameera Reddy) తో ఎక్కువగా సినిమాలు చేశారు. దాంతో వీళ్లిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోంది తొందర్లోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ కొన్ని వార్తలయితే వచ్చాయి.
మరి ఏమైందో తెలియదు గానీ మొత్తానికైతే వీళ్ళ మధ్య ఎలాంటి ప్రేమ లేదని, ఎవరికి వారు ఇండివిజువల్ గా ఉంటున్నారని ఎక్కువ సినిమాల్లో కలిసి నటించడం వల్లే వాళ్ళ మధ్య ఇలాంటి గాసిప్స్ వచ్చాయంటూ వార్తలు వచ్చాయి…ఇక ఆ తర్వాత కొంతమంది సినిమా మేధావులు కూడా ఈ విషయాల మీద క్లారిటీ ఇచ్చే ప్రయత్నమైతే చేశారు. మరి ఏది ఏమైనా కూడా వీళ్ళిద్దరి ప్రేమ విషయం అనేది అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా వచ్చిన చాలా సినిమాలు మంచి విజయాలను సాధించాయి. అయితే ఈయన అనుష్కతో చాలా సినిమాలు చేశాడు. అందువల్ల వీళ్ళిద్దరి మధ్య ఒక లవ్ ట్రాక్ నడుస్తుందని తొందర్లోనే వీళ్ళు పెళ్లి చేసుకోబోతున్నారంటూ వీళ్ళ మీద చాలా కామెంట్లైతే రావడం విశేషం… మరి మొత్తానికైతే వీళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ గా ఉన్నామని మా మధ్య ఎలాంటి రిలేషన్ షిప్ లేదని ఎవరికి వారు క్లారిటీ ఇచ్చారు. దాంతో ప్రస్తుతానికి ఇద్దరు సినిమాలు చేసుకుంటూ ఎవరి కెరీర్ ని వాళ్ళు బిల్డ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు…
ఇక ఏది ఏమైనా ఈ ఇద్దరు హీరోలు యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తంలో స్టార్ హీరోలుగా భారీ గుర్తింపును సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు. ఇక రాబోయే సినిమాలతో భారీ విజయాలను సాధించడమే కాకుండా పాన్ ఇండియాలో నెంబర్ వన్ హీరోగా ఎదగడం కోసమే వాళ్ళు తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు…