సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటీనటులు ఉన్నప్పటికి టాలెంట్ ఉన్నవాళ్ళకి మాత్రమే ఇక్కడ మంచి గుర్తింపైతే ఉంటుంది. హీరోల పరిస్థితి ఇలా ఉంటే, హీరోయిన్ల పరిస్థితి మరి దారుణంగా ఉంటుంది. ఒక్క సక్సెస్ వస్తే స్టార్ హీరోయిన్స్ అవుతారు, లేకపోతే పాతాళానికి పడిపోతారు. హీరోలతో సినిమాల్లో కలిసి నటిస్తున్న క్రమంలోనే నటీమణులు సైతం తమ తోటి నటులతో ఫ్రెండ్షిప్ చేస్తారు. ఇలాంటి సందర్భంలోనే వాళ్ళతో కలిసి మూవ్ అవుతూ ఉంటారు. ఈ క్రమం లోనే స్టార్ హీరోలు హీరోయిన్స్ మధ్య చాలా మంచి బాండింగ్ అయితే ఏర్పడుతుంది. సరిగ్గా ఆ సమయంలోనే కొంతమంది స్టార్ హీరోలు వాళ్ళకి నచ్చిన హీరోయిన్స్ తో ఎఫైర్ పెట్టుకుంటారు. దీనివల్ల హీరో సర్కిల్లో ఉన్న డైరెక్టర్లందరితో ఆ హీరోయిన్ కి వాళ్ల సినిమాల్లో అవకాశం ఇప్పిస్తాడు. తద్వారా హీరోయిన్స్ కి ఆఫర్లైతే వస్తూ ఉంటాయి. ఇలా హీరో హీరోయిన్స్ మధ్య ఎఫైర్స్ అనేవి సాధారణంగా జరుగుతూనే ఉన్నాయి. కారణం ఏదైనా కూడా సినిమా ఇండస్ట్రీ అంటే గ్లామర్ ఫీల్డ్ కాబట్టి అందులో ఏం చేసైన సరే సక్సెస్ అవ్వాలనే ఉద్దేశ్యంతో కొందరు ఉంటారు.
ఇంకొందరు మాత్రం వ్యక్తిగత స్వేచ్ఛకు ఇబ్బంది కలగకూడదని అనుకుంటుంటున్నప్పటికి మరి కొందరు మాత్రం వాళ్ళ అంతరాత్మను చంపుకొని ఇండస్ట్రీలో ఉంటారు. ఇక ఇవన్నీ అలవాటైన వాళ్లు మాత్రమే ఇండస్ట్రీలో ఎక్కువ కాలం పాటు కొనసాగుతారు. మడి కట్టుకొని కూర్చున్న వాళ్ళకి ఇక్కడ అవకాశాలైతే పెద్దగా రావనే విషయం అందరికి తెలిసిందే…
కొంతమంది హీరోయిన్లు అయితే ఓపెన్ గా ‘కాస్టింగ్ కౌచ్’ అనేది ఇండస్ట్రీలో ఒక భాగం అయిపోయింది. సినిమాల్లో నటించే హీరో- హీరోయిన్స్, హీరోయిన్-దర్శకుల మధ్య మంచి బాండింగ్ అయితే ఉంటుంది. ఇక రీసెంట్ గా ఒక స్టార్ హీరోయిన్ కూడా ఒక స్టార్ హీరో తో ఎఫైర్ నడిపిస్తుందనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ఆ విషయం తెలుసుకున్న ఆ స్టార్ హీరో భార్య ఆ హీరోయిన్ కి స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చిందని సోషల్ మీడియాలో కొన్ని వార్తలైతే వస్తున్నాయి.
ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరు? ఆ హీరోయిన్ ఎవరు? అనే విషయాలను పక్కన పెడితే ఇండస్ట్రీలో ఇలాంటి సంఘటనలు చాలా తరచుగా జరుగుతూనే ఉంటాయని లైట్ తీసుకునే వాళ్ళు కొందరైతే, ఇలాంటి సంఘటనలు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా జరగండానికి కారణం ఏంటి అని ప్రశ్నించే వాళ్ళు సైతం ఉన్నారు. ఇక అందరు హీరోలు, దర్శకులు అలానే ఉంటారని చెప్పలేము. కొంతమంది ఇలాంటి ఇల్లీగల్ పనులు చేయడం వల్ల ఇండస్ట్రీలో ఉన్న అందరి హీరోల మీద చాలా చులకన భావమైతే కలుగుతుంది…