Relationship
Relationship : దాంపత్య జీవితం చాలా అందమైనది. దీనిని అలాగే కొనసాగించేందుకు ఎంతో చాకచక్యంగా వ్యవహరించాలి. ముఖ్యంగా దంపతులు ఇద్దరిలో ఎవరో ఒకరు కాస్త దూకుడుగా వ్యవహరిస్తారు. కానీ మరొకరు కూడా అలాగే ప్రవర్తిస్తే ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. ఒకరు దూకుడుగా ఉంటే మరొకరు శాంతంగా ఉండడంవల్ల ఇద్దరి మధ్య అన్యోన్యం పెరుగుతుంది. అయినా ఒక్కోసారి ఇతరులు ఎవరో ఒకరు తమ తీరును మార్చుకోరు. అయితే వారు విడిపోవాలని మనసులో అనుకున్నప్పుడు వారిలో కొన్ని లక్షణాలు బయటపడుతూ ఉంటాయి. వీటిని బాగా పరిశీలించినట్లయితే వారు తనని విడిచి పెట్టాలని అనుకుంటున్నారని తెలుసుకోవచ్చు. ఇంతకీ ఎలాంటి లక్షణాలతో వారు దూరమయ్యే అవకాశం ఉంటుందని తెలుసుకోవచ్చో చూద్దాం..
ఒక పని చెప్పినప్పుడు జీవిత భాగస్వామి సరిగా చేయకపోవడం.. లేదా శ్రద్ధ పెట్టి దానిని పూర్తి చేయకపోవడం.. వంటి లక్షణాలు కలిగి ఉన్నట్లయితే ఆ వ్యక్తి భాగస్వామితో విడిపోవడానికి సిద్ధంగా ఉన్నట్లు అని అర్థం చేసుకోవాలి. ఈ వ్యక్తి తన భాగస్వామి కోసం ఏ పని చేయడానికి అయినా సిద్ధంగా ఉండడు. లేదా ఏ విషయం చెప్పినా పెద్దగా ఆసక్తి చూపించే అవకాశం ఉండదు. అందువల్ల ఈ లక్షణాలు ప్రారంభమయ్యాయి అంటే ఆ వ్యక్తిని బాగా పరిశీలిస్తూ ఉండాలి.
Also Read : ఏడడుగుల తడబాటు.. బలహీన పడుతున్న వైవాహిక బంధాలు.. పెరుగుతున్న విడాకులు!
పెళ్లయిన తర్వాత కొందరు అన్యోన్యంగా జీవిస్తారు. ఇద్దరి మధ్య ఎలాంటి పెద్ద గొడవ అయినా వెంటనే కలిసిపోతారు. కానీ కొందరు చిన్న గొడవకే పెద్ద సీన్ చేసి దూరంగా ఉంటారు. మళ్లీ కలవడానికి అస్సలు ప్రయత్నించారు. కనీసం మాట్లాడడానికి కూడా ఇష్టపడరు. ఇలాంటి లక్షణాలు ఉన్న వారితో జాగ్రత్తగా ఉండాలి. వారు ఎదుటి వ్యక్తితో శాశ్వతంగా దూరం కావడానికి ప్రయత్నిస్తున్నట్లు అనుకోవాలి. అయితే కనీసం నెలలోపు తిరిగి మనసు మార్చుకుంటే పర్వాలేదు. కానీ అలాగే కొనసాగితే మాత్రం వారిని గమనిస్తూ ఉండాలి.
ఇద్దరి మధ్య గొడవ అనేది కామన్. ఇలాంటి సమయంలో ఎవరో ఒకరు వెనక్కి తగ్గి.. ఎదుటివారిని హగ్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఇలా చేసినప్పుడు ఎదుటి వ్యక్తి అస్సలు ఆసక్తి చూపలేక పోతే.. ఆ వ్యక్తితో దూరంగా ఉండటమే మంచిది. ఎందుకంటే ఎవరైనా.. ఎంత కోపం వచ్చినా.. ఒక్కసారి హగ్ చేసుకుంటే తమ వారు అనుకుంటే వారు విడిచిపెట్టారు. కానీ ఇలా చేసిన వారు దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నారంటే.. వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మానసికంగానే కాకుండా శారీరకంగా కూడా వారు దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు.
భవిష్యత్తు గురించి కొందరు దంపతులు ఎన్నో కలలు కంటారు. ఇందుకోసం ప్రీ ప్లాన్ ప్రాజెక్టులు చేపడతారు. అయితే ఈ విషయంలో భాగస్వామ్యం లో ఎవరైనా ఆసక్తి చూపకపోవడం.. భవిష్యత్తు గురించి చెబితే పట్టించుకోకపోవడం వంటివి చేస్తే.. ఆ వ్యక్తి పార్ట్నర్ తో దూరం కావడానికి సిద్ధంగా ఉన్నారని అర్థం చేసుకోవాలి. ఈ విషయం ముందే పసిగట్టి ఆ వ్యక్తితో భవిష్యత్తు ప్లాన్ గురించి చెప్పకపోవడమే మంచిది. ఇలాంటి లక్షణాలున్న వ్యక్తితో జాగ్రత్తగా ఉంటూ వారికి దూరంగా ఉండడమే మంచిది.