Homeఎంటర్టైన్మెంట్Tollywood Heroines: ఈ హీరోయిన్స్‌కు వారి తల్లులే నరకం చూపించార‌ట‌.. ఆస్తి కోసం ఇంత దారుణమా..!

Tollywood Heroines: ఈ హీరోయిన్స్‌కు వారి తల్లులే నరకం చూపించార‌ట‌.. ఆస్తి కోసం ఇంత దారుణమా..!

Tollywood Heroines: సెలబ్రిటీలు అనగానే సాధారణంగా జనం వారికి ఎటువంటి కష్టం ఉండబోదు అని అనుకుంటారు. కానీ, వారు కూడా రకరకాల సమస్యలతో బాధపడుతుంటారు. అయితే, ఆ విషయాలు ఒక్కోసారి పెద్దగా బయటకు రాకపోవచ్చు. అలా ఈ హీరోయిన్స్ పాలిట వారి తల్లులే విలన్స్‌గా మారారు. అలా తల్లుల వలన ఇబ్బందులు పడ్డ హీరోయిన్స్ గురించి తెలుసుకుందాం.

Tollywood Heroines
Tollywood Heroine Sridevi

దివంగత స్టార్ హీరోయిన్ శ్రీదేవి.. అంటే తెలుగు ప్రేక్షకులకు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె నటించిన ప్రతీ సినిమాను తెలుగు వారు ఆదరించారు. అయితే, ఆమెకు తన తల్లి వల్ల కాదు. కానీ, తన సోదరి వల్ల ఇబ్బందులు వచ్చాయి. శ్రీదేవి సంపాదించిన ఆస్తిలో తనకు వాటా ఇవ్వాలని తన సోదరి శ్రీలత డిమాండ్ చేసింది. అలా సొంత సోదరి నుంచి ఇబ్బందులు వచ్చాయి. అలా కొన్నాళ్ల పాటు శ్రీదేవి ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుందట.

Tollywood Heroines
Tollywood Heroine Anjali

Also Read: నన్ను ఆంటీ అంటారేంటి ?.. ఫీల్ అవుతున్న అనసూయ !

ఇకపోతే తొలితరం హీరోయిన్ కాంచన.. కష్టపడి సంపాదించుకున్న ఆస్తులన్నిటినీ ఆమె తల్లిదండ్రులే స్వాధీనం చేసుకున్నారు. దాంతో ఆమె చాలా బాధపడిపోయింది. తల్లిదండ్రులపైన లీగల్ ఫైట్ చేసింది. చివరకు తన ఆస్తులను తానే దక్కించుకుంది. హీరోయిన్ అంజలికి తన పిన్నితో ఆర్థిక వివాదాలున్నాయి. తాను పెంచి పోషించడం వలనే స్టార్ హీరోయిన్ గా అంజలి మారిందని, ఈ నేపథ్యంలో అంజలి సంపాదనలో తనకు వాటా ఇవ్వాలని అంజలి పిన్ని డిమాండ్ చేసింది.

అలా తన వాటా కోసం అంజలి పిన్ని పట్టుబట్టడంతో అంజలి తన ఆస్తిలో కొంత భాగాన్ని కోల్పోయింది కూడా. హీరోయిన్ సంగీతకు, తన తల్లికి ఓ ఇంటి విషయమై గొడవలు జరిగినట్లు వార్తలొచ్చాయి. మంజుల తన కూతురు లవ్ మ్యారేజ్ చేసుకోవడాన్ని వ్యతిరేకించింది. అలా తల్లీ కూతుళ్ల మధ్య గొడవ జరిగింది. ఆస్తుల పంపకాల్లో ఇబ్బందులు తలెత్తాయి. దివంగత స్టార్ హీరోయిన్ సౌందర్య..మరణించిన తర్వాత తన ఆస్తి కోసం తల్లిదండ్రులు, బంధువులు గొడవ పడిన సంగతి అందరికీ విదితమే. అలా ఈ స్టార్ హీరోయిన్స్ పాలిట తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులు విలన్స్ అయ్యారని చెప్పొచ్చు.

Also Read: భయంకర వ్యాధులతో చావు అంచుల వరకు వెళ్లి బయటపడ్డ హీరోయిన్స్ వీళ్లే..

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.

3 COMMENTS

  1. […] IPhone: ఐఫోన్‌ అనగానే గొప్ప బ్రాండ్ అని ఫీల్ అవుతుంటారు. అసలు ఐఫోన్‌ వాడుతున్నారు అంటే.. అదొక గొప్ప స్టేటస్. అయితే, ఐఫోన్‌ ప్రియులకి శుభవార్త. అమెజాన్‌ గ్రేట్‌ రిపబ్లిక్‌ డే సేల్‌లో భాగంగా, ఐఫోన్‌ 12 రేటుని బాగా తగ్గించి అమ్ముతోంది. నలుపు రంగులోని 64 జీబీ ఐఫోన్‌ 12 రూ. 11,901 తగ్గించి రూ. 53,999 కే అమ్ముతుంది. దీని ఒరిజినల్‌ రేట్‌ రూ. 65,900 /-,. ఇది మంచి డీల్. […]

Comments are closed.

RELATED ARTICLES

Most Popular