Tollywood Heroine: ఆ తర్వాత 15 ఏళ్ల చిన్న వయసులోనే నటిగా వెండితెరపై కనిపించింది. హీరోయిన్ గా పలు సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకుంది. ఆ సమయంలోనే తన తోటి హీరోని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఫోటోలో ఉన్న ఈ హీరోయిన్ ని గుర్తుపట్టగలరా. టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఈమె బాగా ఫేమస్. 11 ఏళ్లకే చైల్డ్ ఆర్టిస్ట్ గా తన సినీ కెరియర్ ని ప్రారంభించింది. హీరోయిన్గా పలి సినిమాలలో నటించి సక్సెస్ కూడా అయింది. తెలుగుతోపాటు కన్నడలో పలు సినిమాలలో నటించి ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది.
Also Read: నితిన్ ‘రాబిన్ హుడ్’ ఓటీటీ విడుదల పై బ్యాన్..కారణం ఏమిటంటే!
తెలుగులో ఫేమస్ రియాలిటీ షో అయినా బిగ్ బాస్ షోలో కూడా సందడి చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ అందాల తార సినిమాలలో కనిపించడం లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఒక యంగ్ హీరోను ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత ఈ బ్యూటీ క్రమంగా సినిమాలను తగ్గించింది. కానీ ఎప్పటిలాగానే సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన ఫ్యాషనబుల్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అందరిని అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే నిత్యం ఈ బ్యూటీ కి చెందిన లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. హీరోయిన్ మరెవరో కాదు యంగ్ హీరో వరుణ్ సందేశ్ సతీమణి వితిక షేరు. ఇది వితిక షేరు చిన్ననాటి ఫోటో. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఈమె పలు సినిమాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత ఈమె నటిగా ఇంతు ప్రీతి బంతు అనే కన్నడ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
పలు కన్నడ సినిమాలలో నటించి మంచి గుర్తింపును తెచ్చుకున్న తర్వాత ఈమె ప్రేమించు రోజుల్లో అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ తర్వాత తెలుగులో సందడి, మంచు మనోజ్ హీరోగా నటించిన ఝుమ్మంది నాదం, భీమిలి కబడ్డీ జట్టు, ప్రేమ ఇష్క్ కాదల్, పడ్డానండి ప్రేమలో వంటి పలు సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది. పలు సినిమాలలో ఈ బ్యూటీ సపోర్టింగ్ పాత్రలలో కూడా కనిపించింది. తమిళ్లో కూడా ఒకటి రెండు సినిమాలలో నటించి మెప్పించింది. వరుణ్ సందేశ్ తో సినిమా చేస్తున్న సమయంలోనే వన్ సందేశ్ తో ప్రేమలో పడింది. ఆ తర్వాత వరుణ్ సందేశ్, వితికా షేరు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత ఈమె టీవీ షోస్ లోనే ఎక్కువగా సందడి చేస్తుంది. ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ లో తన భర్త వరుణ్ సందేశ్ తో కలిసి పాల్గొంది.
Also Read: ‘కోర్ట్’ దర్శకుడికి ఖరీదైన బహుమతి ఇచ్చిన హీరో నాని..చూస్తే ఆశ్చర్యపోతారు!