Court : ఈ ఏడాది కలెక్షన్స్ పరంగా అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన చిత్రాల్లో ఒకటి ‘కోర్ట్'(Court Movie). నేచురల్ స్టార్ నాని(Natural Star Nani) నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రంలో ప్రియదర్శి(Priyadarshi), హర్ష రోషన్, శ్రీదేవి, శివాజీ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం ద్వారా ‘రామ్ జగదీశ్’ అనే నూతన దర్శకుడు మన టాలీవుడ్ కి పరిచయం అయ్యాడు. తొలిసినిమాతోనే అద్భుతమైన గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో రామ్ జగదీశ్ ఈ సినిమాని మల్చిన తీరు అద్భుతం అనే చెప్పాలి. సినిమా ఆరంభం నుండి ఎండింగ్ వరకు ఒక్క క్షణం కూడా బోర్ కొట్టదు. మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపించే రిపీట్ వేల్యూ ని జొప్పించడం అంత ఆశా మాషి విషయం కాదు. ఇప్పటికే నాని ప్రశాంత్ వర్మ, శైలేష్ కొలను లాంటి టాలెంటెడ్ డైరెక్టర్స్ ని తన నిర్మాణ సంస్థ ద్వారా ఇండస్ట్రీ కి పరిచయం చేసాడు.
Also Read : చావా’ ని వెనక్కి నెత్తిన ‘కోర్ట్’..బ్రహ్మరథం పడుతున్న హిందీ ఆడియన్స్!
ఇప్పుడు ఆ జాబితాలోకి రామ్ జగదీశ్ కూడా చేరిపోతాడు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదేమో. అయితే రామ్ జగదీశ్ ప్రతిభ ని ఎంతో మెచ్చుకునన్ నాని, అతనికి బహుమతిగా ఒక ఖరీదైన కారుని ఇచ్చినట్టు తెలుస్తుంది. అందరి హీరోలు లాగా ఈ విషయాన్నీ బయట పెట్టడానికి నాని అన్న ఒప్పుకోలేదు, అది ఆయన గొప్పతనం అంటూ రామ్ జగదీశ్ రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. ఇకపోతే కోర్ట్ చిత్రం ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు థియేటర్స్ లో వచ్చిన రెస్పాన్స్ కంటే పదింతలు ఎక్కువ రెస్పాన్స్ నెట్ ఫ్లిక్స్ లో వచ్చింది. ఏ రేంజ్ లో అంటే ‘చావా’ చిత్రాన్ని కూడా వెనక్కి నెట్టి నెంబర్ 1 స్థానంలో ట్రెండ్ అయ్యే రేంజ్ లో అన్నమాట. చూస్తుంటే ఈ సినిమా ఓటీటీ లో రికార్డ్స్ అన్నిటిని బద్దలు కొట్టేలా ఉంది.
నిర్మాతగా నాని కి అంతకు ముందు తీసిన సినిమాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి కానీ, ‘కోర్ట్’ సక్సెస్ ఇచ్చిన కిక్ ఇంకో సినిమా ఇవ్వలేదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కమర్షియల్ గా లాభాలు అందుకుంటూనే, ఒక గొప్ప సినిమాని తీసాను అనే సంతృప్తి నాని కి మిగిలింది. ఇప్పుడు ఆయన నిర్మాతగా వ్యవహరించిన మరో చిత్రం ‘హిట్ 3’ వచ్చే నెల 1వ తేదీన విడుదల కాబోతుంది. ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఓవర్సీస్ లో మొదలు పెట్టగా, సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. కేవలం నార్త్ అమెరికా నుండే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా లక్ష డాలర్ల గ్రాస్ వసూళ్లు వారం రోజుల ముందే వచ్చిందంటేనే అర్థం చేసుకోవచ్చు. ఈ చిత్రం ఓపెనింగ్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది. కచ్చితంగా ఇది నాని కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ ని సాధించే సినిమా అవుతుందని అంటున్నారు ట్రేడ్ పండితులు.
Also Read : కోర్ట్’ వరల్డ్ వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్..ఆ ఒక్క ప్రాంతంలో నష్టాలు తప్పలేదు!