Star Heroine : అలాగే వరుస సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు స్పెషల్ సాంగ్స్ తో కూడా ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీని ఏలేసిన ఒక స్టార్ హీరోయిన్ ప్రస్తుతం 42 ఏళ్ళ వయసులో కూడా స్పెషల్ సాంగ్ చేసేందుకు రెడీ అవుతుంది. ఒకప్పుడు ఈ హీరోయిన్ తన అందంతో, అభినయంతో టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీని ఏలేసింది. తెలుగుతోపాటు ఈ బ్యూటీ తమిళ్, కన్నడ, మలయాళ భాషలలో కూడా ఎన్నో సినిమాలలో అగ్ర కథానాయకగా నటించి స్టార్ నటిగా రాణించింది. టాలీవుడ్ లో ఈ చిన్నది మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, రజినీకాంత్, ఎన్టీఆర్, ప్రభాస్ వంటి అగ్ర హీరోలకు జోడిగా నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.
Also Read : నందమూరి యంగ్ హీరోల మధ్య భారీ పోటీ ఉండనుందా..?
ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా రాణించిన ఈ బ్యూటీ ప్రస్తుతం కూడా సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతుంది. అప్పట్లో ఈ అమ్మడి డేట్స్ కోసం దర్శక నిర్మాతలు కూడా వెయిట్ చేసేవారు. ప్రస్తుతం నాలుగు పదుల వయసులో కూడా ఈ చిన్నది అడపాదడపా సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది. కానీ ఇప్పుడు హీరోయిన్ గా కాకుండా సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో కనిపిస్తుంది. అయితే గత కొంతకాలం నుంచి ఈమెకు ఆశించిన స్థాయిలో అవకాశాలు అయితే రావడం లేదు. దీంతో ఇండస్ట్రీలో కొంచెం సైలెంట్ అయినా ఈ బ్యూటీ ప్రస్తుతం స్పెషల్ సాంగ్ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతుంది. తాజాగా ఈ చిన్నది ఓ స్టార్ హీరో సినిమాలో స్పెషల్ సాంగ్ చేసేందుకు సిద్ధం అయ్యిందట. డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహిస్తున్న రెట్రో సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇందులో హీరో సూర్యకు జోడిగా హాట్ బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తుంది.
మరో పది రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దాంతో ఈ సినిమా యూనిట్ ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్లో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు కూడా నెలకొన్నాయి. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ అన్ని కూడా సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమాలో టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ శ్రియ శరన్ స్పెషల్ సాంగ్ లో నటిస్తుందని వినిపిస్తుంది. అలాగే ఈ సినిమాలో ఈ స్పెషల్ సాంగ్ ఓ రేంజ్ లో ఉండబోతుంది అంటూ టాక్. చాలా ఏళ్ల తర్వాత శ్రియా మళ్లీ స్పెషల్ సాంగ్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తర్వాత మళ్లీ శ్రియకు వరుస అవకాశాలు వస్తాయని అందరూ అనుకుంటున్నారు.