The Girlfriend Movie: ఈమధ్య కాలం లో ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్స్ లోకి వచ్చి ఆడియన్స్ ని సర్ప్రైజ్ కి గురి చేసిన చిత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్'(The Girlfriend Movie). రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమాలో రష్మిక(Rashmika Mandanna) ప్రధాన పాత్ర పోషించింది. దీక్షిత్ అనే కొత్త కుర్రాడు ఇందులో హీరోగా నటించాడు. సినిమాకు మంచి పాజిటివ్ టాక్ రావడం, కలెక్షన్స్ అదరగొట్టడం వంటివి కేవలం రష్మిక అద్భుతమైన నటన వల్లే సాధ్యమైందని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. ఈ ఏడాదికి ఉత్తమ నటి అవార్డులు మొత్తం రష్మిక కి వెళ్లినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అంత అద్భుతంగా ఇందులో ఆమె నటించింది. భవిష్యత్తులో రష్మిక తో ఇలాంటి క్యారెక్టర్స్ చేయించుకోవడానికి ఇక నుండి డిఏక్టర్స్ ఎగబడతారు అనడం లో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ సినిమాని ముందుగా రష్మిక తో చెయ్యాలని అనుకోలేదట.
రాహుల్ రవీంద్రన్ కి మొదటి నుండి సమంత(Samantha Ruth Prabhu) అత్యంత సన్నిహితురాలు. ఈ కథ ని రాహుల్ ఆమెని దృష్టిలో పెట్టుకొనే డెవలప్ చేసాడట. కానీ ఇంతలోపు సమంత కి అనారోగ్యం కారణం గా కొంతకాలం సినిమాలకు గ్యాప్ ఇచ్చి విశ్రాంతి తీసుకునే పరిస్థితి రావడం తో, ఆమెకు బదులుగా రష్మిక ని ఎంపిక చేసుకున్నారట. రష్మిక ని తీసుకోవాల్సిందిగా స్వయంగా సమంత నే రాహుల్ కి సూచించింది అట. ప్రస్తుతం ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన కొత్త హీరోయిన్స్ లో నటన అదరగొట్టే సత్తా కేవలం ఒక రష్మిక మాత్రమే ఉందని, నీ కథకు ఆమె మాత్రమే న్యాయం చేయగలదు అని సమంత రాహుల్ కి సూచించింది అట. దీంతో రాహుల్ రష్మిక ని సంప్రదించడం, ఆమెకు కూడా కథ అద్భుతంగా నచ్చడం వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఈ సినిమా చేయడం జరిగింది. ఇప్పుడు ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఈ ఏడాది అతి పెద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ లో ఒకటిగా నిలబడబోతోంది.
ఒకవేళ సమంత ఈ సినిమాని ఒప్పుకొని చేసుంటే ఇంకా పెద్ద హిట్ అయ్యేది అనడం లో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఇంతకు ముందు ఆమె యశోద,ఓ బేబీ వంటి లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ ని తన ఖాతాలో వేసుకుంది. అంతే కాకుండా సమంత ఓవర్సీస్ మార్కెట్ చాలా పెద్దది. ఆ బ్రాండ్ ఎలాంటిది అంటే, ఈ ఏడాది ఆమె నిర్మాతగా వ్యవహరించిన ‘శుభం’ చిత్రం, కేవలం సమంత పేరు మీద ఓవర్సీస్ లో విడుదలై సూపర్ హిట్ గా నిల్చింది. ఆమె నిర్మాతగా పని చేసిన చిత్రానికే అంత క్రేజ్ ఉంటే, ఇక గర్ల్ ఫ్రెండ్ లాంటి కథ ని ఆమె ఒప్పుకొని చేసుంటే కేవలం ఓవర్సీస్ నుండే ఆ చిత్రం 2 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి ఉండేది అని విశ్లేషకులు అంటున్నారు.