Raja Saab movie reshoot: ఏడాది రెండు మూడు సినిమాలు చేస్తూ వచ్చే ప్రభాస్(Rebel Star Prabhas) నుండి ఈ ఏడాది ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. ‘కన్నప్ప’ చిత్రం లో ప్రధాన పాత్ర అయితే చేసాడు కానీ, అభిమానులకు ఆ చిత్రం ఏ మాత్రం సంతృప్తి కలిగించలేదు. ఈ ఏడాది డిసెంబర్ 5 న రాజాసాబ్(The Rajasaab Movie) చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు అంటూ నిర్మాతలు అధికారిక ప్రకటన చేశారు. కానీ బయ్యర్స్ సంక్రాంతి కి రావడం బెటర్ అని సూచనలు ఇవ్వడం తో ఈ చిత్రం జనవరి 9 వ తేదికి వాయిదా పడింది. దీంతో ఈ ఏడాది ప్రభాస్ సినిమా లేకుండా బ్లాంక్ సంవత్సరం గా మిగిలిపోయింది. ఇదంతా పక్కన పెడితే గత కొద్దిరోజుల నుండి ఈ సినిమా సంక్రాంతి నుండి కూడా తప్పుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. VFX వర్క్స్ చాలా వారకు బ్యాలన్స్ ఉందని, కచ్చితంగా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని వార్తలు రావడం తో మేకర్స్ స్పందించారు.
సోషల్ మీడియా లో ప్రచారమయ్యే వార్తలను అసలు నమ్మొద్దు, సినిమా అనుకున్న ప్లాన్ ప్రకారమే జనవరి 9 న విడుదల కాబోతుంది, అభిమానులు సంబరాలు చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి అంటూ ఒక లేఖని విడుదల చేశారు. కానీ ఇప్పుడు కొన్ని కీలక సన్నివేశాలను మరోసారి రీ షూట్ చేసే పరిస్థితి వచ్చిందని ఫిలిం నగర్ లో లేటెస్ట్ గా వినిపిస్తున్న వార్త. నిన్న మొన్నటి వరకు టాకీ పార్ట్ మొత్తం పూర్తి అయ్యింది, కేవలం పాటల చిత్రీకరణ ఒక్కటే బ్యాలన్స్ అంటూ వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు మాత్రం ఇప్పటికే చిత్రీకరించిన కొన్ని సన్నివేశాలను మరోసారి రీ షూట్ చేస్తున్నారని, జనవరి నెలలో ఈ చిత్రం విడుదలయ్యే అవకాశమే లేదని, ఫిబ్రవరి కి షిఫ్ట్ అయ్యింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో ఎంత మాత్రం నిజముందో అంటూ అభిమానులు కంగారు పడ్డారు.
ఇదే విషయాన్ని రీసెంట్ గా నిర్మాత విశ్వప్రసాద్ ని రిపోర్టర్ అడగ్గా, సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని, ఆకతాయిలు క్రియేట్ చేసే రూమర్స్ పై త్వరలోనే సీరియస్ యాక్షన్ తీసుకుంటామని చెప్పుకొచ్చారు. అంతే కాకుండా ఈ చిత్రం నుండి మొదటి లిరికల్ వీడియో సాంగ్ ని కూడా త్వరలోనే విడుదల చేయబోతున్నాము అంటూ ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చాడు. ఈ చిత్రం లో హీరోయిన్స్ గా మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ నటించగా, సంజయ్ దత్ ప్రధాన పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ కి ఆడియన్స్ నుండి ఎంతటి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందో మనమంతా చూసాము.