Tollywood Heroine: సినిమాలలో స్టార్ హీరోలతో సమానంగా ఫైట్స్ మరియు యాక్షన్స్ అన్ని వేశాలతో ఈ ముద్దుగుమ్మ అదరగొడుతుంది. సౌత్ సినిమా ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూనే అటు బాలీవుడ్ లో కూడా తన సత్తా చాటుతుంది ఈ బ్యూటీ. సినిమాలలో సాధారణంగా హీరోయిన్లు గ్లామర్ పాత్రలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ ఉంటారు. వాళ్లు హీరోలతో కలిసి రొమాంటిక్ సన్నివేశాలలో ఎక్కువగా చేస్తుంటారు. కానీ ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఉన్న కొందరు హీరోయిన్లు మాత్రం హీరోలతో సమానంగా ఫైట్లు, యాక్షన్స్ అన్ని వేశాలలో నటిస్తున్నారు. లేడీ ఓరియంటెడ్ సినిమాలలో నటిస్తూ తమకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే టాలీవుడ్ హీరోయిన్ కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ సినిమాలతో అదరగొడుతుంది. ఈ ముద్దుగుమ్మ కూడా కెరియర్ ప్రారంభంలో ఎక్కువగా గ్రామర్ ఉన్న పాత్రలకే ఓకే చెప్పేది. ఎక్కువగా ఈ చిన్నది సినిమాలలో సెకండ్ హీరోయిన్ గా కనిపించేది. దీంతో ఈ ముద్దుగుమ్మకు అనుకున్న స్థాయిలో గుర్తింపు రాలేదు.
Also Read: చాలా క్యూట్ గా ఉన్న ఈ చిన్నారి ఒకప్పుడు సౌత్ సినిమా ఇండస్ట్రీలో తోపు హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టగలరా…
కానీ ఈ మధ్యకాలంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ హీరోయిన్ సినిమా ఈమె జీవితాన్ని మలుపు తిప్పింది అని చెప్పడంలో సందేహం లేదు. యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను దర్శకుడు తెరకెక్కించాడు. ఈ సినిమాలో ఈమె నటనకు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు వచ్చాయి. బాక్సాఫీస్ దగ్గర సినిమా కూడా భారీ విజయం సాధించింది. ఈ సినిమా థియేటర్లలో పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అయ్యే ఏకంగా 200 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి కొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఈ సినిమా భారీ విజయం తర్వాత ఈ బ్యూటీ ఎక్కువగా యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాలలో నటిస్తుంది. హీరోలతో సమానంగా గన్స్ పట్టుకొని ఫైట్ చేస్తుంది. యాక్షన్స్ సన్నివేశాలతో కూడా ఈ బ్యూటీ అదరగొడుతుంది.
ఈ హీరోయిన్ మరెవరో కాదు ఈ మధ్యకాలంలో ది కేరళ స్టోరీ అనే సినిమాతో ఒక్కసారిగా బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషన్ అయిన హీరోయిన్ అదా శర్మ. అదా శర్మ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈమె తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అదా శర్మ మల్టీ టాలెంటెడ్ అమ్మాయి. చిన్నప్పటినుంచి అదా శర్మ చదువుతోపాటు ఎక్స్ట్రా కర్క్యులర్ యాక్టివిటీస్ లో కూడా బాగా రాణించేది. ఈమె చదువుతున్న సమయంలో డాన్స్, మార్షల్ ఆర్ట్స్, జిమ్నాస్టిక్స్ వంటి వాటిలో ప్రత్యేక శిక్షణ పొందింది. అందుకే ఈ భామ ఈ మధ్యకాలంలో సినిమాలలో నీళ్లు తాగినంత సులభంగా సినిమాలలో యాక్షన్ సన్నివేశాలలో నటిస్తుంది. ఇక ఇటీవలే రిలీజ్ అయిన బస్టర్ దీ నక్సల్ స్టోరీ సినిమాలో అదా శర్మ యాక్షన్ సన్నివేశాలతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
View this post on Instagram