Meena Kumari: వాళ్లు సాధించిన స్టార్డమ్ వెనక వారి జీవితంలో ఊహించని విషాదాలు అలాగే ఎవరికీ చెప్పుకోలేని కష్టాలు కూడా ఉంటాయి. ప్రస్తుతం మనం ఒక లెజెండరీ హీరోయిన్ కథ గురించి తెలుసుకుందాం. కన్నీళ్ళతో ఆమె జీవితం ప్రారంభమయ్యే వెండితెర మీద అద్భుతాలను సృష్టించి ఆ తర్వాత అర్ధాంతరంగా చిన్న వయసులోనే ఆమె జీవితం ముగిసిపోయింది. ఏమైనా చిన్నతనంలో కన్న తండ్రి అనాధశ్రమంలో వదిలేశాడు. పట్టుదలతో ఈమె ఇండియన్ సినిమా గర్వించదగిన నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఈమె పేరు మీనా కుమారి. ఈమె అసలు పేరు మహాజభింభాను. ఆగస్టు ఒకటి, 1933లో అలీ బక్స్, ఇక్బాల్ బేగం దంపతులకు మీనా కుమారి జన్మించింది. ఆడపిల్ల పుట్టిందని తండ్రి నిరాశ చెందాడు. ఆ సమయంలో హాస్పటల్ ఫీజులు కూడా కట్టలేని పరిస్థితిలో మీనా కుమారిని ఒక అనాధాశ్రమంలో తండ్రి వదిలేసాడు.
Also Read: చాలా క్యూట్ గా ఉన్న ఈ చిన్నారి ఒకప్పుడు సౌత్ సినిమా ఇండస్ట్రీలో తోపు హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టగలరా…
ఆ తర్వాత మళ్లీ తన తప్పును తెలుసుకొని వెంటనే వెళ్లి కూతురిని ఇంటికి తెచ్చుకున్నాడు. కుటుంబం ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉండడంతో నాలుగు సంవత్సరాల చిన్న వయసులోనే మహాజబీన్ ను సినిమాలలోకి పంపించారట. మహాజబీన్ లెదర్ ఫేస్, అధూరి కహాని, పూజా వంటి సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించడం జరిగింది. ఏక్ హి భూల్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆమెకు విజయ్ భట్ బేబీ మీనా అని పేరు పెట్టారట. ఆ తర్వాత ఈమె బచ్చోంకా ఖేల్ అనే సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఆ సమయం నుంచి ఆమె మీనా కుమారిగా సినిమా ఇండస్ట్రీలో రాణించింది. రెండు దశాబ్దాలలో ఈమె స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించి బాగా గుర్తింపు తెచ్చుకుంది. ఈమె నటనకు సినిమా ప్రేక్షకులు ఫిదా అయ్యేవారు. ఈమె నటనతోపాటు కవయిత్రి, సింగర్, కాస్ట్యూమ్ డిజైనర్ గా కూడా రాణించింది. తన ఎమోషనల్ నటనతో ట్రాజడీ క్వీన్ గా కూడా బిరుదు అందుకుంది.
తన 30 ఏళ్ల సినీ జీవితంలో 90 కి పైగా సినిమాలలో నటించి ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. అప్పటికే రెండుసార్లు పెళ్లి చేసుకున్న 34 ఏళ్ల ప్రముఖ దర్శకుడు కమల్ అమరోహి ని 18 ఏళ్ల మీనా కుమారి పెళ్లి చేసుకుంది. పెళ్లి జరిగిన తొలినాళ్లలో బాలీవుడ్ క్యూట్ కపుల్ గా వీరు పేరు తెచ్చుకున్నారు. కానీ ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే వారి కాపురంలో కలతలు రావడం ప్రారంభించాయి. మీనా కుమారి మీద భర్త చేయి చేసుకోవడం అలాగే మానసిక వేధించడం ప్రతి విషయంలో కూడా తన మాట వినాలని అనుకోవడం వంటివి చేయడం వలన వారి దాంపత్య జీవితం నరకంలాగా మారిపోయింది. 1964లో వీరు విడాకులు తీసుకొని విడిపోయారు. ఈ బాధతో ఆ తర్వాత మీనా కుమారి మద్యానికి బానిస అయిపోయింది. కొన్ని ఏళ్లుగా మద్యం సేవించడంతో ఆమె అనారోగ్యం కారణంగా మార్చి 31, 1972లో తనకు 38 ఏళ్ళు ఉన్న సమయంలో కన్ను మూసింది.