Homeఎంటర్టైన్మెంట్సావిత్రి, సౌందర్య, శ్రీదేవి మరణంలోని కీలకపాయింట్ ఇదే..

సావిత్రి, సౌందర్య, శ్రీదేవి మరణంలోని కీలకపాయింట్ ఇదే..

sridevi
సినిమా ఇండస్ట్రీ అంటే ఓ రంగుల  ప్రపంచం.. సినిమా కలల్లో విహరిద్దామని.. ఓవర్ నైట్ స్టార్ అయిపోదామని అందరూ ఆరాటపడుతుంటారు. సినిమాల్లోకి వచ్చి స్టార్ లుగా ఎదగాలని ఉబలాటపడుతుంటారు. ఒక్క చాన్స్ అంటూ దేనికైనా రెడీ అంటారు. అలా వచ్చి తెలుగు సినిమాను ఏలిన వారు ఎంతో మంది ఉన్నారు. కానీ సినిమాల కోసమే జీవించి.. చివరకు సినిమాలతోనే అంతమైన వారు కొందరే ఉన్నారు. ఇందులో ముఖ్యులు ముఖ్యంగా ముగ్గురు.. తెలుగు చలనచిత్ర సీమపై తమదైన ముద్ర వేశారు టాప్ హీరోయిన్లు సావిత్రి, సౌందర్య, శ్రీదేవి. మరి వీరి మరణంలోనూ ఓ సాపేక్ష కారణం ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
*సావిత్రి
వెండితెరపై మహానటిగా వెలుగొందిన సావిత్రి తన వ్యక్తిగత జీవితంలో మాత్రం ఓడిపోయింది. సినిమాల్లో ధ్రువతారగా.. మేటినటిగా అలరించినా.. భర్తతో విభేధాలు.. అనవసరంగా అందరినీ నమ్మి ఆస్తులు కోల్పోయి చివరకు దిక్కుతోచని స్థితిలో తనువు చాలించింది. సావిత్రి సినిమాల్లోకి వచ్చాక ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించింది. కానీ రెండో పెళ్లివాడైన జెమినీ గణేషన్ ను చేసుకున్నాకే సావిత్రి పతనం ప్రారంభమైంది. జెమినీకి ఉన్న అమ్మాయిల పిచ్చి సావిత్రికి తెలియడం.. ఆమె భర్తకు దూరంగా జరగడం.. ఆ తర్వాత జెమినీపై కోపంతో సినిమాలు తీసి ఆర్థికంగా నష్టపోయింది. దానదర్మాలు చేసి అప్పులపాలైంది. చివర్లో ఆమె ఆస్తి అంతా ఇన్ కం ట్యాక్స్ కు పోయి దిక్కుదివానం లేక బంధువులంతా ఆస్తులు లాక్కొని మోసం చేయడంతో మద్యానికి బానిసై చనిపోయింది. సినిమాలపై ఎన్నో ఆశలతో వచ్చిన సావిత్రి కేవలం భర్త వల్లే ఇంత పతానవస్థకు కారణమైందంటే అతిశయోక్తి కాదు..
*సౌందర్య.. 
తెలుగు సినిమా చరిత్రలోనే మేటి నటిగా దాదాపు 10ఏళ్లు కొనసాగింది సౌందర్య. తెలుగులోని అగ్రహీరోలందరితో నటించింది. కుర్రహీరోలు, హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల్లో కూడా నటించింది. హీరోయిన్ గా కెరీర్ చరమాంకంలో కర్ణాటకకు చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ను పెళ్లి చేసుకొంది. అయితే శ్రీదేవి ఆస్తి విషయంలో తగాద వచ్చింది. శ్రీదేవి పుట్టింటి వారు, భర్తకు మధ్య విభేదాలు వచ్చి కొట్టుకున్నారు. ఆస్తి తగాదాలతో కోర్టుల చుట్టూ తిరిగారు. ఈ క్రమంలో ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టి శ్రీదేవి రాజకీయాల వైపు అడుగులు వేసింది. ఈ క్రమంలోనే బీజేపీ తరఫున ప్రచారం చేయడానికి బెంగళూరు నుంచి కరీంనగర్ కు విమానంలో వస్తూ మధ్యలో విమానం కూలి మరణించింది. శ్రీదేవి మరణం తర్వాత కూడా ఆమె ఆస్తి కోసం ఇప్పటికీ భర్త, ఆమె తల్లిదండ్రుల మధ్య పోరు నడుస్తోంది. శ్రీదేవి భర్త వైఖరే ఆమెను రాజకీయాల వైపు అడుగులు వేయించిందని.. అందుకే ప్రమాదవశాత్తూ చనిపోయిందనే విమర్శలున్నాయి. ఇలా శ్రీదేవి మరణానికి కూడా పరోక్షంగా భర్తే కారణంగా తెలుస్తోంది.
*శ్రీదేవి..
కలియుగ అతిలోక సుందరిగా పేరుగాంచిన శ్రీదేవి దక్షిణ భారతదేశంలోని అన్ని భాషల్లో నటించి మెప్పించింది. రజినీకాంత్ , కమల్ హాసన్ నుంచి తెలుగులో చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్, మలయాళంతో పాటు ఆ తర్వాత హిందీలో కూడా అగ్రహీరోలందరితో నటించి దేశంలోనే నంబర్ 1 హీరోయిన్ అనిపించుకుంది. కానీ ఈమె కూడా కుటుంబ గొడవలతో తనువు చాలించింది. అప్పటికే పెళ్లై పిల్లలున్న బోనీకపూర్ ను చేసుకొని శ్రీదేవి పెద్ద తప్పు చేసింది.శ్రీదేవి తన ఆస్తిపాస్లులన్నింటిని భర్త పరం చేయడం.. భర్త మొదటి భార్య పిల్లలకు కూడా వాటాలివ్వడం.. కూతుళ్ల భవిష్యత్తుపై ఆందోళనతో శ్రీదేవి మానసికంగా కృంగి దుబాయ్ లో అపస్మారక స్థితిలోకి వెళ్లి మరణించింది.
ఇలా సావిత్రి, శ్రీదేవి, సౌందర్య ముగ్గురు టాప్ హీరోయిన్ల మరణానికి వారి భర్తలే పరోక్షంగా కారణం.. వెండితెరనే ఏలాలనుకున్న వారి కల నిజజీవితంలో నిజమైనా… వ్యక్తిజీవితంలో మాత్రం ఓడిపోయారు.  అంతుచిక్కని వీరి మరణాలు సినిమా పరిశ్రమలోని ఎత్తుపల్లాలను సూచిస్తున్నాయి.
NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

1 COMMENT

Comments are closed.

Exit mobile version