Manchu Manoj : గత ఏడాది నుండి మంచు కుటుంబం లో చోటు చేసుకుంటున్న వివాదాలను మనమంతా చూస్తూనే ఉన్నాం. ఈ వివాదం ప్రస్తుతం కోర్టు పరిధి లో కూడా నడుస్తుంది. జల్ పల్లి లో ఉంటున్న తన నివాసం లో మంచు మనోజ్ ఉండేందుకు వీలు లేదని, నా ఆస్తులను అనుభవించడానికి మనోజ్(Manchu Manoj) కి ఎలాంటి హక్కు లేదని కోర్టు లో కేసు వేశాడు. ఇకపోతే తన భార్య మౌనిక తో కలిసి ఇన్ని రోజులు పర్యటనలో ఉన్న మనోజ్ ఇప్పుడు మళ్ళీ జల్ పల్లి లోని మోహన్ బాబు నివాసానికి వచ్చాడు. మనోజ్ వస్తున్నాడు అనే విషయాన్నీ తెలుసుకొని పోలీసులు మోహన్ బాబు ఇంటి వద్ద భారీ బందోబస్తుని ఏర్పాటు చేశారు. అంతే కాకుండా మోహన్ బాబు ఇంటికి కిలోమీటర్ దూరంలో పోలీసులు ఒక చెక్ పోస్టుని కూడా ఏర్పాటు చేశారు.
Also Read : ఫ్యామిలీ తగాదాల పై ఎట్టకేలకు అసలు నిజాలు బయటపెట్టిన మంచు మనోజ్.. ఇంత జరిగిందా !
మోహన్ బాబు(Manchu Mohan Babu) నివాసానికి చేరుకున్న మనోజ్, తనని లోపలకు అనుమతించకపోవడంతో గేట్ ముందే బైఠాయించి ధర్నా చేశాడు. తన కారుని సోదరుడు మంచు విష్ణు ఎత్తుకెళ్లాడని పోలీసులకు మనోజ్ ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం నాకు ఉండేందుకు ఎలాంటి ఇల్లు లేదని, నా వస్తువులను మొత్తం ఎత్తి అవతలేశారని, నాకు ఎలాంటి దారి కనిపించకపోవడం తో ఈ ఇంటికి రావాల్సి వచ్చిందని మంచు మనోజ్ వాపోయాడు. ఆయన ఇంటి గేట్ ముందు కూర్చొని ధర్నా చేస్తున్న వీడియోలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఈ వీడియోలను చూసిన నెటిజెన్స్ చాలా ఎక్కువ చేస్తున్నాడని, ఇలా పరువు తక్కువ పనులు చేయడం వల్లే మోహన్ బాబు ఇంట్లో నుండి గెంటేసాడని, మనోజ్ ఇప్పటికీ పరువు తీసే పనులు చేస్తున్నాడని, ఇవన్నీ చూసేందుకు చాలా చిల్లరగా అనిపిస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరోపక్క మనోజ్ ని సపోర్ట్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు.
కొడుకు పట్ల ఇంత పంతం ఎందుకు అంటూ మోహన్ బాబు ని తిడుతున్న వాళ్ళే ఇప్పటికీ ఎక్కువగా ఉన్నారు. ఇకపోతే చాలా కాలం నుండి సినిమాలకు దూరం గా ఉంటూ వచ్చిన మనోజ్, ఇప్పుడు మళ్ళీ వరుస సినిమాలతో ఫుల్ బిజీ గా మారిపోయాడు. కేవలం హీరో పాత్రలకు మాత్రమే పరిమితం కాకుండా, విభిన్నమైన క్యారెక్టర్స్ చేయడానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. అందులో భాగంగానే ఆయన ‘భైరవం’, ‘మిరాయ్’ వంటి చిత్రాలు చేశాడు. ఈ రెండు సినిమాల్లోనూ ఆయన నెగటివ్ రోల్స్ లో కనిపించనున్నాడు. ‘భైరవం’ మూవీ షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి అయ్యాయి. ఇందులో హీరో గా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తుండగా, నారా రోహిత్ ప్రత్యేక పాత్రలో కనిపించాడు. షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక తేజ సజ్జ తో కలిసి చేసిన ‘మిరాయ్’ చిత్రం ఈ ఏడాది లోనే విడుదల కాబోతుంది.
Also Read : మంచు మనోజ్ అరెస్ట్ పై వీడిన సస్పెన్స్..నన్ను వేధిస్తున్నారంటూ పోలీస్ స్టేషన్ లో వాగ్వాదం..అసలు ఏమైందంటే!
జల్పల్లిలో మోహన్ బాబు ఇంటి ముందు మంచు మనోజ్ ధర్నా
జల్పల్లి మోహన్ బాబు నివాసం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు
మోహన్ బాబు నివాసానికి కిలోమీటర్ దూరంలో చెక్ పోస్ట్ ఏర్పాటు చేసిన పోలీసులు
తన కారును తన సోదరుడు మంచు విష్ణు ఎత్తుకెళ్లాడని.. తనకు ఎక్కడా ఇల్లు లేనందున ఈ… pic.twitter.com/LgyRpnJ5mX
— Telugu Scribe (@TeluguScribe) April 9, 2025