https://oktelugu.com/

Tollywood Couples: నటించిన మొదటి సినిమాతోనే లవ్ లో పడి పెళ్లి పీటలు ఎక్కిన టాలీవుడ్ జంటలు..!!

మొదటగా జీవితా రాజశేఖర్.. 1987 సంవత్సరంలో తలంబ్రాలు సినిమాలో తొలిసారి జీవిత, రాజశేఖర్ నటించారు. ఈ చిత్రంతో ఏర్పడిన స్నేహం తరువాత ప్రేమగా మారింది. ఆ తరువాత వీరి ప్రేమ పెళ్లి పీటలు ఎక్కగా.. వీరికి ఇప్పుడు ఇద్దరు కుమార్తెలు. వీరు కూడా ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోయిన్లుగా రాణిస్తున్నారు.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : March 17, 2024 / 05:58 PM IST

    Tollywood Couples:

    Follow us on

    Tollywood Couples: తెలుగు చిత్ర పరిశ్రమలో నటీనటులుగా రాణించిన ఎందరో ప్రేమ పెళ్లిళ్లు చేసుకుని జీవితంలో సెటల్ అయిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో ఈ విధంగా లవ్ మ్యారేజ్ చేసుకున్న జంటలు చాలానే ఉన్నాయి. నటించిన మొదటి సినిమాతోనే ప్రేమలో పడి వివాహం చేసుకున్న వాళ్లు కూడా ఉన్నారు. వీరిలో కొందరు వీడిపోయినా చాలా మంది కలిసే ఉన్నారు. అలా నటించిన తొలి సినిమాతోనే ప్రేమలో పడి పెళ్లి చేసుకున్న జంటలు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

    మొదటగా జీవితా రాజశేఖర్.. 1987 సంవత్సరంలో తలంబ్రాలు సినిమాలో తొలిసారి జీవిత, రాజశేఖర్ నటించారు. ఈ చిత్రంతో ఏర్పడిన స్నేహం తరువాత ప్రేమగా మారింది. ఆ తరువాత వీరి ప్రేమ పెళ్లి పీటలు ఎక్కగా.. వీరికి ఇప్పుడు ఇద్దరు కుమార్తెలు. వీరు కూడా ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోయిన్లుగా రాణిస్తున్నారు. ఆ తరహాలోనే ఊహ, శ్రీకాంత్. వీరిద్దరు కూడా ఆమె అనే సినిమాలో తొలిసారి కలిసి నటించారు. తరువాత ప్రేమలో పడిన ఈ జంట పెద్దల ఆశీర్వాదం తో వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు. వీరిలో పెద్ద కొడుకు హీరోగా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు.

    అదేవిధంగా టాలీవుడ్ లోనే మోస్ట్ క్యూట్ కపుల్ మహేశ్ బాబు -నమ్రతా శిరోద్కర్.. వంశీ సినిమాతో మొదలైన వీరి ప్రయాణం ప్రేమకు ఆ తరువాత పెళ్లికి దారి తీసింది. దీంతో 2004 లో వీరి వివాహం జరగగా.. ఈ జంటకు ఇద్దరు సంతానం. అలాగే అక్కినేని నాగార్జున – అమలు కూడా కలిసి నటించిన మొదటి సినిమా తరువాత ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు.

    ఇక బద్రి సినిమాలో కలిసి నటించిన పవన్ కళ్యాణ్, రేణుదేశాయ్ కూడా ప్రేమ పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం కాగా కొన్నేళ్ల తరువాత విడిపోయారు. అదేవిధంగా అక్కినేని నాగచైతన్య -సమంత.. ఏ మాయ చేసావే సినిమాలో తొలిసారి కలిసి నటించిన ఈ జంట ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. కానీ వీరి బంధం ఎక్కువ కాలం నిలవలేదు. కొన్ని కారణాలతో విడిపోయారు. ఇదే బాటలో తాజాగా కిరణ్ అబ్బవరం కూడా చేరారు. రాజావారు రాణివారు సినిమాలో మొదటిసారి కలిసి నటించిన కిరణ్ అబ్బవరం, రహస్య ప్రేమించుకున్నారు. ఇటీవలే ఎంగేజ్మెంట్ చేసుకున్న వీరు త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నారు.