Farmers : పంటలను కాపాడుకునేందుకు రైతు వినూత్న ప్రయోగం.. దెబ్బకు అడవిపందులు పరార్..

దీంతో ఆ రైతు పంట వైపు జంతువులు రావడం మానేశాయి. ఈ రైతు చేసిన ప్రయోగానికి చాలా మంది ఫిదా అయ్యారు. మరికొన్ని ప్రాంతాల్లో ఇలాగే జంతు సమస్యలు ఉండడంతో ఇలాంటి కంచెలు ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారు. ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ ప్రయోగం ఉండడంతో చాలా మంది రైతును ప్రశంసిస్తున్నారు.

Written By: NARESH, Updated On : March 17, 2024 5:09 pm
Follow us on

Farmers :  మనిషి జీవించడానికి ఆహారం కావాలి.ఆ ఆహారాన్ని తయారు చేసే రైతుకు ఇబ్బందులు ఎదురైతే ఆహార కొరత ఏర్పడుతుంది. కొన్ని ప్రాంతాల్లో రాత్రి, పగలనక కష్టపడి పండించిన కొన్ని పంటలను జంతువులు ధ్వంసం చేస్తున్నాయి.ముఖ్యంగా కొండ ప్రాంతాల్లోని రైతులు ఈ సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో కొందరు చేసేదేమీ లేక ఆవేదన చెందుతున్నారు. అయితే ఓ రైతు మాత్రం ఓ వినూత్న ప్రయోగం చేసి పంటలను కాపాడుకుంటున్నాడు. ఈ రైతు ప్రయోగంతో రైతులకు, జంతువులకు ఎలాంటి ఇబ్బందులు కలగడం లేదు. కానీ జంతువులు మాత్రం పంటను ముట్టడం లేదు. ఇంతకీ ఆ రైతు ఏం చేశాడంటే?

ఆంధ్రప్రదేశ్ లోని ఉమ్మడి గోదావరి జిల్లాలో దుంపలు ఎక్కువగా పండిస్తారు. కానీ ఇవి చేతికొచ్చే సమయంలో అడవి పందులు వచ్చి వాటిని ధ్వంసం చేస్తుంటాయి. అయితే కొందరు రైతులు విద్యుత్ కంచెలు ఏర్పాటు చేయడంతో ఇటు రైతులకు, అటు జంతువులకు తీవ్ర నష్టం జరిగింది. అందువల్ల ఆ కంచె ఏర్పాటు చేయడం మానుకున్నారు. ఇలాంటి సమయంలో ఓ రైతు ఎవరికీ ఇబ్బంది కలగకుండా ఓ ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యాడు.

కాకినాడ జిల్లాలలోని కమ్మర లోవ ప్రాంతంలో ఎక్కువగా కొండ ప్రాంతం ఉంటుంది. దీంతో చాలా వరకు జంతువులు ఇక్కడికి వస్తుంటాయి. ఈ పరిసర ప్రాంతాల్లో పంటలను ధ్వంసం చేస్తుంటాయి. దీంతో ఓ రైతు తన పంట చుట్టూ ఒక ఇనుప బెండింగ్ వైర్ ను చుట్టాడు. వాటికి మధ్య మధ్యలో కర్రలు ఏర్పాటు చేసి వాటికి బలంగా చుట్టాడు. అయితే వీటిపై జంతువులు దూకడానికి భయపడుతున్నాయి. కింది నుంచి వెళ్దామంటే ఆ వైరుకు తాకి ఏదో శబ్దం రావడంతో పంట లోపలికి పోవడం లేదు.

దీంతో ఆ రైతు పంట వైపు జంతువులు రావడం మానేశాయి. ఈ రైతు చేసిన ప్రయోగానికి చాలా మంది ఫిదా అయ్యారు. మరికొన్ని ప్రాంతాల్లో ఇలాగే జంతు సమస్యలు ఉండడంతో ఇలాంటి కంచెలు ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారు. ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ ప్రయోగం ఉండడంతో చాలా మంది రైతును ప్రశంసిస్తున్నారు.