Venkatesh And Anil Ravipudi: వెంకటేష్ అనిల్ రావిపూడి కాంబో లో వస్తున్న సినిమాలో వెంకీ పాత్ర ఏంటంటే..?

గత సంవత్సరం దసరా కానుకగా వచ్చిన భగవంత్ కేసరి సినిమాతో అనిల్ రావిపూడి ఒక భారీ బ్లాక్ బాస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక దానికి తగ్గట్టుగానే ఇప్పుడు కూడా వెంకటేష్ తో మరొక బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది. చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి మ్యాజిక్ చేస్తాడు అనేది...

Written By: Gopi, Updated On : March 17, 2024 6:02 pm

Venkatesh And Anil Ravipudi

Follow us on

Venkatesh And Anil Ravipudi: డాక్టర్ డి రామానాయుడు కొడుకుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన వెంకటేష్ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకొని ఫ్యామిలీ ఆడియన్స్ లో తన పేరుని సుస్థిరం చేసుకున్నాడు. ఈయన సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్ ను బాగా అలరిస్తాయి. అలాగే ఈయన సినిమా చూసేటప్పుడు వాళ్ళు వెంకటేష్ ను కూడా వాళ్ల ఫ్యామిలీ మెంబర్ గా భావిస్తూ సినిమాను చూస్తారు అనడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

అలాంటి ఒక క్రేజ్ ను వెంకటేష్ ఏర్పాటు చేసుకున్నాడు. ముఖ్యంగా ఆయన సినిమాల్లో సెంటిమెంట్, ఫ్యామిలీ డ్రామా అనేది ఎక్కువగా ఉండటం వల్ల ఆయన అంత మంచి పేరునైతే సొంతం చేసుకున్నాడు. ఇక ఇలాంటి వెంకటేష్ ఇప్పుడు చేస్తున్న వరుస సినిమాలు సూపర్ డూపర్ సక్సెస్ లను అందుకుంటున్నాయి. అలాగే ఏమాత్రం ఈగో లేకుండా ఏ హీరోతో అయిన మల్టీ స్టారర్ సినిమాను చేసే దమ్మున్న నటుడు కూడా వెంకటేష్ కావడం విశేషం… ఇక ఇప్పుడు ఆయన అనిల్ రావిపూడి డైరెక్షన్ లో మరొక సినిమా చేస్తున్నాడు. ఇక ఇప్పటికే వీళ్ళ కాంబినేషన్ లో ఎఫ్2, ఎఫ్3 సినిమాలు వచ్చాయి. ఇక దీంతో వీళ్ళ కాంబినేషన్ లో ఇది హ్యాట్రిక్ మూవీ కాబోతున్నట్టుగా తెలుస్తుంది.

మరి ఈ సినిమాతో ఎలాగైనా సక్సెస్ కొట్టాలని అటు వెంకటేష్, ఇటు అనిల్ రావిపూడి ఇద్దరు కూడా బలంగా నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమాతో కూడా కామెడీ ని పండించడానికి రెడీ అవుతున్నారు. ఇక వెంకటేష్ ఈ సినిమా లో ఫ్రస్టేటెడ్ సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ గా నటించబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి…

ఇక గత సంవత్సరం దసరా కానుకగా వచ్చిన భగవంత్ కేసరి సినిమాతో అనిల్ రావిపూడి ఒక భారీ బ్లాక్ బాస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక దానికి తగ్గట్టుగానే ఇప్పుడు కూడా వెంకటేష్ తో మరొక బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది. చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి మ్యాజిక్ చేస్తాడు అనేది…