Chiranjeevi: అన్యాయం చేస్తున్నా.. అందర్నీ కలుపుకుపోవాలనుకునే మనస్తత్వం వల్ల ఎవరికీ లాభం ? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా రేట్లు తగ్గించి పరిశ్రమకు ఇబ్బందులు తెచ్చి పెట్టింది. ఇరవై ఏళ్ల క్రితం నాటి ధరలతో ఇప్పుడు సినిమాలు అమ్ముకోమంటుంది. అదేం అంటే.. సినిమా హీరోలు ప్రతి సినిమాకు 50 కోట్లు లేదా 100 కోట్లు సంపాదిస్తున్నారు అంటూ లేనిపోని వ్యాఖ్యలు చేస్తోంది.
మొన్న నాని భయపడుతూనే రెండు ముక్కలు జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాడు. అంతే.. అతని పై విరుచుకుపడ్డారు మంత్రులు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా చిరంజీవి మంచితనం అంటూ ముందుకు పోతే అది చివరకు చేతకాని తనమే అవుతుంది. పరిశ్రమ సమస్యల్ని ప్రభుత్వాల దృష్టికి తీసుకు వెళ్లాల్సిన బాధ్యత మనపై ఉంది అంటూ చిరంజీవి మళ్లీ వెళ్లి జగన్ ను కలుస్తున్నాడు.
ఈ విషయంలో చిరంజీవి ఎప్పుడూ చొరవ చూపుతూనే వస్తున్నారు. అయితే ఆ చొరవ వల్ల సినిమా ఇండస్ట్రీకి మాత్రం ఎలాంటి ఉపయోగం ఉండటం లేదు. మొదటి నుంచీ ప్రభుత్వాలను డిమాండ్ చేయడంలో చిరంజీవి వెనుక పడుతూనే ఉన్నారు. ఒక మాట ఉన్నది ఉన్నట్టు మాట్లాడటానికి కూడా చిరంజీవి ఒకటికి పది సార్లు ఆలోచిస్తూ నెమ్మదిగా సున్నితంగా అందరి మెప్పు పొందేలా మాట్లాడి చివరకు సమస్యను మధ్యలోనే వదిలేస్తున్నారు.
Also Read: విశాల్ “సామాన్యుడు” మూవీ టీజర్ రిలీజ్…
ఇది కచ్చితంగా తప్పే. అసలు పట్టించుకోకపోతే మరో ఎవరో ముందుకు వస్తారు. తానే ముందుకు వచ్చి.. సమస్యకి పరిష్కారం చూపించలేక సైలెంట్ హడావిడి చేసి వెళ్ళిపోతే ఉపయోగం ఏమిటి ? అయినా ఇంతవరకు చిరు, జగన్ ను డిమాండ్ చేసింది లేదు. డిమాండ్ చేయలేక, రిక్వెస్ట్ చేస్తూ కాలక్షేపం చేస్తున్నాడు.
చిరంజీవి అనవసరంగా జగన్ ప్రభుత్వానికి రిక్వెస్ట్ లు పెడుతూ టైమ్ వేస్ట్ చేస్తున్నారని సినీ పెద్దలు కూడా సీరియస్ గా అసహనం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి పాపం చిరు ఏమి చేసినా ఉపయోగం లేకుండా పోయింది. అయినా చిరు ఈ ఆశ భావం ఇంకా ఎన్నాళ్ళు ఇలా ?
Also Read: ఒకే చోట సమంత – నాగ చైతన్య… ఆ తర్వాత ఏం జరిగిందంటే