CJI AP Tour:‘చిత్తం శివుడి మీద.. భక్తి చెప్పుల మీద’.. సమాజంలోని భక్తి లేని వారి గురించి వివరిస్తూ చెప్పే ఈ సామెతను ఇప్పుడు ఏపీ సీఎం జగన్, ఆయన భార్య భారతికి అప్లై చేస్తున్నారు బీజేపీ శ్రేణులు. తాజాగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఏపీ పర్యటన సందర్భంగా సీఎం జగన్ ఫ్యామిలీ వ్యవహరించిన తీరుపై సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి.

సహజంగానే సీఎం జగన్ ఫ్యామిలీ క్రైస్తవాన్ని స్వీకరించింది. తాజాగా క్రిస్మస్ సందర్భంగా జగన్, భారతి, విజయమ్మ తదితరులు భక్తి శ్రద్ధలతో వేడుకలు జరుపుకున్నారు. మతాన్ని స్వీకరించడం.. పాటించడం తప్పు కాదు.. అయితే తాజాగా ఏపీలో పర్యటించిన సీజేఐ ఎన్వీ రమణకు వేంకటేశ్వరస్వామి ప్రతిమను కానుకగా ఇవ్వడంపైనే సెటైర్లు పడుతున్నాయి.
వైఎస్ జగన్ ముఖ్యమంత్రి హోదాలో చాలా సార్లు తిరుమలలో నామాలు పెట్టుకొని మరీ ఆ తిరుమలేషుడిని కొలిచాడు. అయితే వైఎస్ భారతి మాత్రం ఒక్కసారి కూడా తిరుమలలో కనిపించలేదు. ఆ దేవుడికి పూజలు చేయలేదన్న ప్రచారం సాగుతోంది. ఇప్పుడు బీజేపీ శ్రేణులు అసలు తిరుమలేషుడిని కొలవని భారతి తాజాగా పర్యటనలో న్యాయమూర్తులకు వేంకటేశ్వరస్వామి ప్రతిమలను ఎందుకు ఇచ్చారని పలువురు ప్రశ్నిస్తున్నారు.
వేంకటేశ్వరుడిని నమ్మక.. ఆ దేవుడిని దర్శించుకొని జగన్ సతీమణి ఇప్పుడు ఆ దేవుడి ప్రతిమలు ఇవ్వడంపై సోషల్ మీడియాలో అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. భక్తి ఉండడంలో తప్పు లేదని.. కానీ పాటించని వారు ఇలా తిరుమలేషుడి ప్రతిమలు ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.