https://oktelugu.com/

Viral Cinema: వైరల్ అవుతున్న టుడే మూవీ అప్ డేట్స్

Viral Cinema: సినిమా వైరల్ నుంచి ప్రజెంట్ క్రేజీ అప్ డేట్స్ విషయానికి వస్తే.. బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ ఆర్ఆర్ఆర్ సినిమాను ఆకాశానికెత్తేశాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హాలీవుడ్ సినిమాలను సైతం బీట్ చేసి దూసుకెళ్తోందన్నాడు. భారతీయ సినిమా ఈ రేంజ్‌లో విజయం సాధించడం గర్వంగా ఉందని చెప్పాడు. రాజమౌళి సినిమాలు ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అవుతున్నాయంటూ కొనియాడాడు. నాటు నాటు అంటూ పాట పాడి అలరించాడు. కాగా ఆర్ఆర్ఆర్ కథ ప్రకారం సినిమాలో […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : March 29, 2022 / 05:11 PM IST
    Follow us on

    Viral Cinema: సినిమా వైరల్ నుంచి ప్రజెంట్ క్రేజీ అప్ డేట్స్ విషయానికి వస్తే.. బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ ఆర్ఆర్ఆర్ సినిమాను ఆకాశానికెత్తేశాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హాలీవుడ్ సినిమాలను సైతం బీట్ చేసి దూసుకెళ్తోందన్నాడు. భారతీయ సినిమా ఈ రేంజ్‌లో విజయం సాధించడం గర్వంగా ఉందని చెప్పాడు. రాజమౌళి సినిమాలు ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అవుతున్నాయంటూ కొనియాడాడు. నాటు నాటు అంటూ పాట పాడి అలరించాడు.

    Ranveer Singh

    కాగా ఆర్ఆర్ఆర్ కథ ప్రకారం సినిమాలో దాదాపు 10 నిమిషాలకు పైగా బ్రిటీషర్ల మధ్య ఇంగ్లీష్ డైలాగ్స్ ఉంటాయి. ముఖ్యంగా మెయిన్ విలన్ స్కాట్ దొర మాట్లాడేవన్నీ ఇంగ్లీష్‍లోనే ఉన్నాయి. ఆ డైలాగ్స్ మాస్ ప్రేక్షకులకు అర్థం కావడం లేదని కంప్లైంట్స్ వస్తున్నాయి. ఇంగ్లీష్ లో మాట్లాడేటప్పుడు కింద తెలుగులో కూడా సబ్ టైటిల్స్ ఉంటే బాగుంటుందని ఓ వర్గం ఆడియన్స్ అభిప్రాయపడుతున్నారు.

    Also Read: OKTelugu MovieTime: వైరల్ అవుతున్న టుడే క్రేజీ అప్ డేట్స్

    RRR

    మరో అప్ డేట్ విషయానికి వస్తే.. బిగ్‌బి అమితాబ్ బచ్చన్ 79 ఏళ్ల వయసులోనూ అదరగొడుతున్నారు. ఇటీవల ఓ యాక్షన్ ప్యాక్డ్ యాడ్ షూటింగ్‌లో ఆయన డూప్ లేకుండా స్టంట్స్ చేశారని డైరెక్టర్ మనోహర్‌వర్మ వెల్లడించాడు. మూడు గట్టి గాజు పలకలను ఆయనే స్వయంగా పగలకొట్టి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడని చెప్పాడు. వయసు అనేది ఒక సంఖ్య మాత్రమే అని అమితాబ్ మరోసారి నిరూపించారని పేర్కొన్నాడు.

    Amitabh Bachchan

    ఇక మరో అప్ డేట్ ఏమిటంటే.. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కోలుకున్న సాయిధరమ్‌తేజ్ కొత్త మూవీ షూటింగ్ ప్రారంభమైంది. సెట్స్‌లో ఉన్న ప్రతి ఒక్కరూ అతనికి ఘన స్వాగతం పలికారు. దాదాపు 6 నెలల తర్వాత షూటింగ్‌కు వెళ్లడం, అక్కడ అందరూ చూపించిన ప్రేమాభిమానాలకు తేజ్ ఎమోషనల్ అయ్యాడు. సినిమా లాంచ్‌ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ ఫిల్మ్ థ్రిల్లర్ నేపథ్యంలో ఉంటుందని తెలుస్తోంది.

    Also Read: RRR 4th day Collections: కలెక్షన్ల ప్రవాహం.. తగ్గేదే లే

    Tags