NTR , Prashant Neel
NTR and Prashant Neel : ప్రస్తుతం మన టాలీవుడ్ నుండి తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రాలలో అభిమానులతో పాటు, ప్రేక్షకులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రాలలో ఒకటి ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా. కేజీఎఫ్ సిరీస్, సలార్ తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కి పాన్ ఇండియా లెవెల్ లో రాజమౌళి కి సరిసమానంగా క్రేజ్ వచ్చింది. హీరోయిజం ని మరో లెవెల్ లో చూపించాలంటే ఇప్పుడున్న దర్శకులలో రాజమౌళి తర్వాత ప్రశాంత్ నీల్ మాత్రమే అనే ముద్ర చాలా బలంగా పడింది. అలాంటి సెన్సేషనల్ మాస్ డైరెక్టర్, ఎన్టీఆర్ లాంటి ఊర మాస్ హీరోతో సినిమా చేస్తున్నాడంటే ఆ మాత్రం అంచనాలు ఉండడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఈ చిత్రం అతి త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ని మొదలు పెట్టుకోనుంది. ఈ సినిమాకి ‘డ్రాగన్’ అనే టైటిల్ పెడుతున్నట్టు గత కొంతకాలంగా వార్తలు వినిపించాయి.
అయితే ఈ టైటిల్ తో ఇప్పుడు ‘లవ్ టుడే’ మూవీ హీరో ప్రదీప్ రంగనాథన్ ఒక చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. దీంతో మేకర్స్ ఇప్పుడు ‘డ్రాగన్’ టైటిల్ ని కాస్త అప్డేట్ చేస్తూ, ‘ఎంటర్ ది డ్రాగన్’ అనే టైటిల్ ని పెట్టుకున్నారు. తాము అనుకున్న ‘డ్రాగన్’ టైటిల్ ని వేరే సినిమా వాళ్ళు వాడుకున్నారు అనే కారణం చేత మాత్రమే కాదు, కథకి తగ్గట్టుగానే ఆ టైటిల్ ని పెట్టినట్టు తెలుస్తుంది. ఎన్టీఆర్ కి కూడా ఈ టైటిల్ తెగ నచ్చేసిందట. ఈ చిత్రం లో హీరోయిన్ గా రుక్మిణి వాసంత్ నటించబోతుందని తెలుస్తుంది. అదే విధంగా తమిళ సూపర్ స్టార్ కమల్ హాసన్ ని ఒక ముఖ్య పాత్ర కోసం డైరెక్టర్ ప్రశాంత్ నీల్ రీసెంట్ గానే సంప్రదించాడట. కమల్ హాసన్ కి కూడా ఆ పాత్ర నచ్చడంతో వెంటనే ఓకే చెప్పినట్టు సమాచారం.
కమల్ హాసన్ లాంటి మహానటుడిగా, ఎన్టీఆర్ లాంటి నేటి తరం మహానటుడు కలిస్తే స్క్రీన్ మీద వాళ్ళిద్దరిని చూసేందుకు రెండు కళ్ళు సరిపోవు. ఈ సినిమాలో వీళ్లిద్దరికీ సరైన పాత్రలు పడితే బాక్స్ ఆఫీస్ వద్ద కలిగే విస్ఫోటనాలు ఊహించడానికి కూడా కష్టమే. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చిన రోజున సోషల్ మీడియా మొత్తం షేక్ అవుతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. చూడాలి మరి ఈ కాంబినేషన్ ఎంత వరకు కార్యరూపం దాలుస్తుంది అనేది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాని విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారు. కానీ అంత తొందరగా ఈ సినిమా పూర్తి అయ్యే అవకాశాలు లేవు. కనీసం రెండేళ్ల సమయం పట్టొచ్చు. ఎలాంటి అడ్డంకులు రాకపోతే ఏడాదికే షూటింగ్ కార్యక్రమాలు పూర్తి అవ్వొచ్చు. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి 300 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ ని ఖర్చు చేస్తున్నట్టు తెలుస్తుంది.