Nagarjuna Career: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. ముఖ్యంగా చిరంజీవి(Chiranjeevi), బాలకృష్ణ(Balakrishna), వెంకటేష్ (Venkatesh), నాగార్జున(Nagarjuna) లకు చాలా మంచి ఇమేజ్ అయితే ఉంది. గత 40 సంవత్సరాల నుంచి వీళ్లు నలుగురు స్టార్ హీరోలుగా రాణిస్తూ సినిమా ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. ఇక ఇప్పుడు యంగ్ హీరోలు వచ్చినప్పటికి ఈ సీనియర్ హీరోలు వాళ్లకు సైతం పోటీని ఇస్తూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం… ఇక చిరంజీవి, వెంకటేష్ లను పక్కన పెడితే బాలయ్య బాబు, నాగార్జున లకు మధ్య గత కొద్దిరోజుల నుంచి మాటలైతే లేవు. అలాగే వీళ్ళ మధ్య తీవ్రమైన పోటీ కూడా నడుస్తోంది. నిజానికి బాలయ్య బాబుకు ఉన్న ఇమేజ్ ప్రస్తుతం నాగార్జునకు లేదు. కారణం ఏంటి అంటే బాలయ్య ఒకానొక సమయంలో వరుసగా డిజాస్టర్ లను మూటగట్టుకోవడంతో ఆడియన్స్ అతన్ని విపరీతంగా ట్రోల్ చేశారు. అయినప్పటికీ తనను తాను కంబ్యాక్ చేసుకొని ప్రేక్షకులకు దగ్గరయ్యే విధంగా మంచి సినిమాలను చేస్తూ వచ్చాడు. ఇక అన్ స్టాపబుల్ షోలో హోస్ట్ గా తనను తాను కొత్త గా పరిచయం చేసుకోవడంతో బాలయ్య మీద ఉన్న నెగిటివిటి మొత్తం తగ్గిపోయింది. దాంతో బాలయ్య అటు హీరోగా సినిమాలను సూపర్ హిట్స్ గా నిలుపుతూనే ఇటు షోలకి హోస్ట్ గా చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం బాలయ్యను ప్రతి ఒక్క ప్రేక్షకుడు అభిమానిస్తూ ఉంటారు. ఇక ఇప్పటికే వరుసగా నాలుగు విజయాలను అందుకున్న బాలయ్య సక్సెస్ ఫుల్ హీరోగా ముందుకు దూసుకెళ్తున్నాడు.
Also Read: SBI న్యూ రూల్స్…ఇకపై డబ్బులు తీసుకోవాలంటే ఈ నియమాలు పాటించాల్సిందే..
ఇక మీదట రాబోయే సినిమాలతో కూడా మంచి విజయాలను అందుకొని తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటి క్రియేట్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు…నాగార్జున మాత్రం అవుట్ డేటెడ్ సినిమాలను చేస్తూ ప్రేక్షకులకు ఏమాత్రం దగ్గర అవ్వలేకపోతున్నాడు. గత కొద్ది సంవత్సరాల నుంచి ఆయన ఒక్క సక్సెస్ ను అందుకోలేకపోతున్నాడు.
అలాగే తన కెరియర్ లో ఒకప్పుడు మంచి సక్సెస్ లను సాధించినప్పటికి ఇప్పుడు చేస్తున్న సినిమాల విషయంలో ఆయన ఏమాత్రం కేర్ ఫుల్ గా వ్యవహరించడం లేదనే విషయమైతే అర్థమవుతుంది. ఆయన చేస్తున్న ప్రతి సినిమా డిజాస్టర్ అవుతుండటంతో ఆయనకు ఎలాంటి సినిమాలు చేయాలో అర్థం కావడం లేదు. ఇక బిగ్ బాస్ షో కి హోస్టుగా వ్యవహరించినప్పటికి నాగార్జున కొంతవరకు విమర్శలను ఎదుర్కొంటున్నాడు.
ఆయన కొంత మందికి మాత్రమే కావాలని సపోర్ట్ చేస్తున్నారని ఆయన వల్లే బాగా ఆడే కంటెస్టెంట్స్ కి కూడా పెద్దగా ఆదరణ లభించడం లేదంటూ పలు రకాల విమర్శలు అయితే వస్తున్నాయి. వీటి వల్ల జనాల్లో నాగార్జున ఇమేజ్ భారీగా తగ్గిపోయింది. ప్రస్తుతం ఉన్న సిచువేషన్ లో బాలయ్య తో పోలిస్తే నాగార్జున ఇమేజ్ అయితే చాలా వరకు తగ్గిపోయిందనే చెప్పాలి…
Also Read: ఆ నేతలకు టిడిపి డోర్ క్లోజ్!